Health Tips: మంచి ఫుడ్స్ తీసుకున్నా.. ఆ విషయంలో ఇబ్బందులు తప్పట్లేదా.. ఓసారి వీటిపై కన్నేయండి..

బలమైన జీర్ణవ్యవస్థకు మంచి ఆహారం మాత్రమే సరిపడదు. కొన్ని విషయాలపై ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు చాలాసార్లు కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వాటివల్ల శరీరానికి నష్టం వాటిల్లుతుంది.

Health Tips: మంచి ఫుడ్స్ తీసుకున్నా.. ఆ విషయంలో ఇబ్బందులు తప్పట్లేదా.. ఓసారి వీటిపై కన్నేయండి..
Indigestion
Follow us
Venkata Chari

|

Updated on: Aug 17, 2022 | 11:01 AM

Health Tips: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం వారు మంచి ఆహారం, వ్యాయామం చేస్తుంటారు. కానీ, కొన్నిసార్లు డైట్ ప్లాన్‌లో మంచి ఆహారాన్ని చేర్చుకున్నా.. జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. బలహీనమైన జీర్ణవ్యవస్థ కారణంగా, శరీరంలో చాలా సమస్యలు మొదలవుతాయి. విరేచనాలు, వాంతులు, మలబద్ధకం లాంటి సమస్యలు మొదలవుతాయి. జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడం వల్ల, ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా దృఢంగా ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో ఆహారంలో చేర్చే పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తినేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం..

ఆహారాన్ని నమిలి తినండి..

మంచి జీర్ణక్రియ నోటితో ప్రారంభమవుతుంది. ఏదైనా ఆహారాన్ని తినడానికి, దానిని సరిగ్గా నమలడం చాలా ముఖ్యం. ఆహారాన్ని నమిలి తిన్నట్లయితే, అది జీర్ణవ్యవస్థ పనిని సులభతరం చేస్తుంది. నెమ్మదిగా నమలడం ద్వారా, మీ శరీరం అవసరమైన హార్మోన్లను స్రవించడానికి తగినంత సమయం పొందుతుంది.

ఇవి కూడా చదవండి

తినేటప్పుడు మాట్లాడకూడదు..

చాలా మందికి భోజనం చేసేటప్పుడు మాట్లాడే అలవాటు ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును సరిదిద్దుకోవాలి. భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా ఆహారం తినాలి. తినేటప్పుడు మాట్లాడటం వల్ల మన ఆహారంతో పాటు గాలి కడుపులోకి వెళ్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను అడ్డుకుంటుంది. అందుకే భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ మాట్లాడకూడదు.

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు..

భోజనం చేసిన 50 నుంచి 60 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఆహారం మింగిన వెంటనే నీళ్లు తాగడం కొందరికి అలవాటు. ఈ అలవాటును వదులుకోండి. ఎందుకంటే ఈ అలవాటు మీ జీర్ణవ్యవస్థకు చాలా హానికరం. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

గమనిక: ఈ కథనంలోని అందించిన చిట్కాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా చిట్కాలను, పద్ధతులను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.