Health Tips: సంతానోత్పత్తి, శృంగార సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ తీసుకోండి.. ఇకపై అన్‌స్టాపబుల్..

Health Tips : సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి మీరు కొన్ని ప్రభావవంతమైన కూరగాయలను తీసుకోవచ్చు. దీంతో స్త్రీ, పురుషులిద్దరి సంతానోత్పత్తి మెరుగవుతుంది.

Health Tips: సంతానోత్పత్తి, శృంగార సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ తీసుకోండి.. ఇకపై అన్‌స్టాపబుల్..
Fertility Problems
Follow us
Venkata Chari

|

Updated on: Aug 15, 2022 | 7:45 AM

Health Tips: కూరగాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా పచ్చి కూరగాయలు, కళ్లను తీసుకోవడం వల్ల ఊబకాయం అదుపులో ఉంటుంది. కానీ, కూరగాయలు సంతానోత్పత్తిని కూడా పెంచుతాయని మీకు తెలుసా? అవును, సంతానోత్పత్తిని పెంచే అనేక కూరగాయలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఈ వ్యాసంలో సంతానోత్పత్తిని మెరుగుపరిచే కొన్ని కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చని ఆకు కూరలు..

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి అండోత్సర్గ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది గర్భస్రావం, జన్యుపరమైన అసాధారణతల అవకాశాలను తగ్గిస్తుంది. సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి పాలకూర, బ్రోకలీ, కాలే, మెంతులు వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. అంతే కాదు, పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల స్పెర్మ్ నాణ్యత కూడా మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి..

వెల్లుల్లి సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి శరీరంలో ఈస్ట్రోజెన్ సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది. తద్వారా సంతానోత్పత్తికి మద్దతు ఇస్తుంది. పురుషులకు, ఇది స్పెర్మ్ కదలికను పెంచడంలో సహాయపడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే గర్భధారణ అవకాశాలను పెంచుతుంది.

బీన్స్..

బీన్స్‌లో లీన్ ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మహిళలకు బీన్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే దాని వినియోగం ద్వారా శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. బీన్స్ స్త్రీ సంతానోత్పత్తి స్థాయిని పెంచుతాయి. లిబిడోను కూడా పెంచుతాయి.