Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ పదర్థాలను ఎక్కువగా తింటున్నారా.. మీ ఆయుష్షును మీరే తగ్గించుకుంటున్నట్లే.. లిస్టులో జాబితా చూస్తే షాక్ అవ్వాల్సిందే..

మనిషి ఆయుష్షు అతని జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒకరి జీవనశైలి బాగుంటే వారు ఎక్కువ కాలం జీవిస్తారు. అలా కాకుండా ఒకరి జీవనశైలి బాగా లేకుంటే వారి జీవితం చాలా తక్కువగా ఉండొచ్చు.

Health Tips: ఈ పదర్థాలను ఎక్కువగా తింటున్నారా.. మీ ఆయుష్షును మీరే  తగ్గించుకుంటున్నట్లే.. లిస్టులో జాబితా చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Food
Follow us
Venkata Chari

|

Updated on: Aug 14, 2022 | 7:05 AM

ప్రతి ఒక్కరూ తన జీవితం సుదీర్ఘంగా ఉండాలని కోరుకుంటారు. ప్రపంచ ఆయుర్దాయం ప్రకారం, భారతదేశంలో పురుషుల సగటు వయస్సు 69.5 సంవత్సరాలు కాగా, స్త్రీల వయస్సు 72.2 సంవత్సరాలు. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, పక్షవాతం, మధుమేహం వంటి దాదాపు 50 వ్యాధులతో చిన్న వయస్సులోనే మరణానికి కారణం అవుతున్నాయి. ఎవరైనా మంచి పదార్థాలను తీసుకుంటే వారి ఆయుష్షు పెరుగుతుంది. అలా కాకుండా అనారోగ్యకరమైన వాటిని తీసుకుంటే వారి జీవితం కూడా తగ్గిపోతుందని సైన్స్ నమ్ముతుంది. మీరు కూడా దీర్ఘాయుష్షు పొందాలనుకుంటే.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేంటో చూద్దాం..

వీటిని తింటే వయసు తగ్గుతుంది..

ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు కొన్ని ఆహార పదార్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావాల గురించి తెలుసుకోవడానికి పరిశోధన చేశారు. మీ జీవితకాలాన్ని కొన్ని నిమిషాలు పెంచే కొన్ని విషయాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అయితే కొన్ని పదార్థాలను వాటిని తీసుకోవడం వల్ల మీ జీవితాన్ని కొన్ని నిమిషాలు తగ్గిస్తాయని వారు సూచించారు. ఉదాహరణకు, ఒకరు సర్వింగ్ గింజలను తీసుకుంటే, అతని జీవితం 26 నిమిషాలు పెరుగుతుంది. కానీ, ఎవరైనా హాట్-డాగ్‌ను తింటే, వారి జీవితం 36 నిమిషాలు తగ్గుతుంది. ఇది కాకుండా, వేరుశెనగ, వెన్న, జామ్, శాండ్‌విచ్ లాంటివి తీసుకుంటే వారి వయస్సు అరగంట పెంచుతాయంట.

ఇవి కూడా చదవండి

6 వేల ఆహార పదార్థాలపై పరిశోధనలు..

నేచర్ ఫుడ్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, వ్యక్తుల జీవితం మంచి జీవన నాణ్యతపై ఆధారపడింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు సుమారు 6 వేల విభిన్న విషయాలను (అల్పాహారం, భోజనం, పానీయం) పరిశీలించారు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తి తన జీవితానికి రోజుకు 48 నిమిషాలు అదనంగా జోడించవచ్చని వారు కనుగొన్నారు.

వీటిని తినడం వల్ల ఆయుష్షు తక్కువగా ఉంటుంది..

ది టెలిగ్రాఫ్ ప్రకారం, ఒక వ్యక్తి జీవితాన్ని తగ్గించగల అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హాట్ డాగ్: 36 నిమిషాల జీవితాన్ని తగ్గిస్తుంది.

ప్రాసెస్ చేసిన మాంసం: ఆయుష్షును 26 నిమిషాలు తగ్గిస్తుంది.

చీజ్ బర్గర్: జీవితకాలాన్ని 8.8 నిమిషాలు తగ్గిస్తుంది.

శీతల పానీయం: జీవితకాలాన్ని 12.4 నిమిషాలు తగ్గిస్తుంది

పిజ్జా: జీవితకాలాన్ని 7.8 నిమిషాలు తగ్గిస్తుంది.

వీటిని తినడం వల్ల వయసు పెరుగుతుంది..

కొన్ని పదార్థాలు తినడం వల్ల వయసు తగ్గినట్లే, కొన్ని పదార్థాలు తినడం వల్ల వయసు కూడా పెరుగుతుంది.

వేరుశెనగ, వెన్న, జామ్, శాండ్‌విచ్ : 33.1 నిమిషాల వయస్సును పెంచుతుంది.

కాల్చిన సాల్మన్ చేపలు : 13.5 నిమిషాలు..

అరటిపండు : 13.5 నిమిషాలు..

టొమాటో : 3.8 నిమిషాలు..

అవోకాడో : 1.5 నిమిషాలు..

ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి..

ఈ అధ్యయనం ఉద్దేశ్యం మానవ ఆరోగ్యం, పర్యావరణంపై ఆహారం ప్రభావం ఎంత వరకు ఉంటుందని చాటి చెప్పడమేనని తెలుస్తోంది. సాల్మన్ ఫిష్‌లో చాలా పోషకాలు లభిస్తాయని, ఒక్క చేప తింటే 16 నిమిషాల జీవితాన్ని పెంచుతుందని నిపుణులు తెలిపారు. పరిశోధనా బృందంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఒలివియర్ జోలియట్ మాట్లాడుతూ, “పరిశోధన నుంచి వచ్చిన ఫలితాలు ప్రజలు వారి ఆరోగ్యం, పర్యావరణాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ప్రజలు వారి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి వారి ఆహారాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది” అని తెలిపారు.