Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గణితం చదివితే ఏం వస్తుంది.. పిల్లాడి సమధానం వింటే పడిపడి నవ్వుతారంతే.. వైరల్ వీడియో..

Trending Video: పిల్లలు ఏదైనా ఆలోచించకుండా మాట్లాతుంటారు. వారి మనసు, హృదయం చాలా స్పష్టంగా ఉంటుంది. జరిగిన ఏ విషయాన్ని వారికి దాచిపెట్టడం తెలియదు.

Viral Video: గణితం చదివితే ఏం వస్తుంది.. పిల్లాడి సమధానం వింటే పడిపడి నవ్వుతారంతే.. వైరల్ వీడియో..
Child Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 14, 2022 | 6:47 AM

చిన్న పిల్లల అందమైన చిలిపి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల అల్లరిని నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. దీంతోనే ఈ వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతంటాయి. తాజాగా ఒక చిన్న పిల్లవాడికి సంబంధించిన చాలా అందమైన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఈ పిల్లాడి చిలిపి రియాక్షన్‌కు ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పిల్లలు ఏదైనా ఆలోచించకుండా మాట్లాడుతుంటారు. వారి మనసు, హృదయం చాలా స్పష్టంగా ఉంటుంది. జరిగిన ఏ విషయాన్ని దాచిపెట్టడం వారికి తెలియదు. నోటితో సూటిగా మాట్లాడటం మనం చూస్తునే ఉంటాం. ఇలాంటి వీడియోలకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివితే వచ్చే లాభాల గురించి పిల్లవాడిని అడిగితే, అది విని అందరూ నవ్వుకోవాల్సినంత సమాధానం చెప్పడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

పిల్లాడి స్పాట్ రియాక్షన్ ఇక్కడ చూడండి..

వైరల్ అవుతున్న ఈ చిన్న క్లిప్‌‌లో చిన్నారి అమాయకంగా స్పందిస్తూ.. లెక్కపెట్టేందుకు డబ్బులు లేనప్పుడు గణితం చదివి ఏం లాభం అంటూ.. చిన్నారి చెప్పిన ఈ స్పాట్ ఆన్సర్ విని ముఖంలో చిరునవ్వులు చిందించని వారు ఉండరంటే నమ్మశక్యం కాదు.

hey_its_me_abhirajbhavik అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. వార్తలు రాసే సమయానికి, దీనికి 94 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ప్రజలు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ఈ వీడియో నిజంగా క్యూట్‌గా ఉందని, ఆ ప్రశ్నకు చిన్నారి చాలా అమాయకంగా సమాధానమిచ్చిందని ఓ యూజర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు, మరొక వినియోగదారు పిల్లల అందమైనతనం నా హృదయాన్ని గెలుచుకుంది అని రాసుకొచ్చారు. మరో వినియోగదారు, ‘పిల్లవాడు చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.