Health Tips: పొడి దగ్గుతో బాధపడుతున్నారా.. ఈ న్యాచురల్ సిరప్‌తో చెక్ పెట్టండిలా..

Natural Cough Syrup: పొడి దగ్గుతో మీరు ఇబ్బంది పడుతుంటే, మీరు సహజంగా ఇంట్లోనే దగ్గు సిరప్‌ను తయారు చేసుకోవచ్చు. దాని సులభమైన వంటకం తెలుసుకుందాం..

Health Tips: పొడి దగ్గుతో బాధపడుతున్నారా.. ఈ న్యాచురల్ సిరప్‌తో చెక్ పెట్టండిలా..
Cough
Follow us

|

Updated on: Aug 16, 2022 | 7:55 AM

దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో శ్లేష్మంతో దగ్గును కలిగి ఉంటారు. అయితే పొడి దగ్గు ఎలా వస్తుందో తెలుసా? యాసిడ్ రిఫ్లక్స్ నుంచి అలెర్జీల వరకు, చాలా విషయాలు పొడి దగ్గుకు కారణమవుతాయి. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పొడి దగ్గుకు స్పష్టమైన కారణం లేదు. మీరు రాత్రి సమయంలో అకస్మాత్తుగా పొడి దగ్గు కలిగి ఉంటే, అప్పుడు చికిత్స అవసరం. మనలో చాలా మంది పొడి దగ్గు చికిత్స కోసం మార్కెట్లో లభించే దగ్గు సిరప్‌లను తీసుకుంటారు. అయితే నేచురల్ దగ్గు సిరప్‌ని ఇంట్లోనే సులువైన మార్గాల్లో కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. అవును, ఇంట్లో తయారుచేసిన దగ్గు సిరప్ పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దగ్గు సిరప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం?

పొడి దగ్గు కోసం సిరప్..

దగ్గు సిరప్‌ను తయారు చేయడానికి మీకు ప్రత్యేక పదార్థాలు అవసరం లేదు. మీరు మీ కిచెన్‌ని ఓసారి పరిశీలిస్తే సరి. సులువైన మార్గాల్లో ఇంట్లోనే దగ్గు సిరప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

అవసరమైన పదార్థాలు..

ఒక టీస్పూన్ నిమ్మరసం

తురిమిన అల్లం చిటికెడు

ఒక కప్పు నీరు

తేనె ఒక చెంచా

నల్ల మిరియాలు ఒక చిటికెడు

ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్

దగ్గు సిరప్ ఎలా తయారు చేయాలి:

దగ్గు సిరప్ సిద్ధం చేయడానికి, అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని గాజు పాత్రలో నిల్వ చేయండి.

ఇంట్లో తయారుచేసిన దగ్గు సిరప్ ప్రయోజనాలు..

ఇంట్లో తయారుచేసిన దగ్గు సిరప్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్‌తో పోరాడవచ్చు. దగ్గును శాంతపరచడం ద్వారా శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఈ దగ్గు సిరప్ తాగిన తర్వాత మీరు నీటిని కూడా తాగొచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్యా ఉండదు. అయితే, ఇందులో ఉన్న వస్తువులకు మీరు ఎలాంటి అలర్జీ లేదని గుర్తుంచుకోవాలి. అప్పుడే ఈ సిరప్‌ను తాగొచ్చు.