AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duck Fat Benefits: ఆ దేశంలో మహిళల స్పెషాలిటీ బాతు నుంచి నూనె తీయడం.. అత్యంత ఖరీదైన ఈ నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

బాతు  నుంచి కొవ్వు ను లేదా ఆయిల్ తయారు చేస్తారని మీకు తెలుసా..! అంతేకాదు ఈ బాతు నూనె తయారు చేయడం కూడా ఒక కళే.. బాతు కొవ్వు ఒక రకమైన టెక్నీక్ తో బయటకు తీస్తారు. ఈ ఆయిల్ తినే ఆహారంలో కలుపుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట..

Duck Fat Benefits: ఆ దేశంలో మహిళల స్పెషాలిటీ బాతు నుంచి నూనె తీయడం.. అత్యంత ఖరీదైన ఈ నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Duck Fat Benefits
Surya Kala
|

Updated on: Aug 16, 2022 | 9:30 AM

Share

Duck Fat Benefits: తినే ఆహార పదార్ధాలను తయారు చేయడం కోసం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఆవాల నూనె, ఆలివ్ ఆయిల్ వంటివి వినియోగించేవారు కాలక్రమంలో సన్ ప్లవర్ ఆయిల్,  పామాయిల్,  రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి వినియోగంలోకి వచ్చాయి. ఇక కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెతో వంటకాలను తయారు చేస్తారు.. కంటి, చర్మ రక్షణ కోసం ‘ఇ’ విటమిన్ ఆయిల్ ను ఉపయోగిస్తారు. ఈ ఆయిల్స్ ను పువ్వులతోనూ, కాయలతోనూ తయారు చేస్తారు. ఇక ‘ఇ’ విటమిన్ ఆయిల్ ను ఒక రకమైన చెప్పనుంచి తయారు చేస్తారు.. ఈ విషయం సర్వసాధారణంగా అందరికీ తెలిసిందే.. అయితే బాతు  నుంచి కొవ్వు ను లేదా ఆయిల్ తయారు చేస్తారని మీకు తెలుసా..! అంతేకాదు ఈ బాతు నూనె తయారు చేయడం కూడా ఒక కళే.. బాతు కొవ్వు ఒక రకమైన టెక్నీక్ తో బయటకు తీస్తారు. ఈ ఆయిల్ తినే ఆహారంలో కలుపుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.. ఈరోజు బాతు కొవ్వుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

తయారీ విధానం: బాతులోని పిట్యూటరీ గ్రంధి నుంచి తీసే నూనె. ఇలా బాతు కొవ్వునుంచి నూనెను డాగేస్తాన్ దేశంలోని ఒక జాతి మహిళలకు మాత్రమే ఈ నేర్పు సొంతమట. ఇది రష్యా సమీపంలో ఉన్న ఒక చిన్న దేశం.. బాతు కొవ్వుని నూనెగా తీయడానికి.. బాతు మెడను మసాజ్ చేస్తారట. అలా మసాజ్ చేస్తూ.. నూనెను బయటకు తీసారట. అందుకనే ఈ బాతు కొవ్వు అత్యంత ఖరీదైంది. ఈ నూనెను తక్కువ మొత్తంలో తినే ఆహారంలో కలుపుకోవచ్చట.. లేదా వంటకాల తయారీ సమయంలో వినియోగించవచ్చట..

ఇవి కూడా చదవండి

ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ బాతు కొవ్వు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జింక్, సెలీనియం వంటి పోషకాలు అధికం. టాక్సిన్స్ నుండి రక్షిస్తుంది.

గుండెకు మంచిది: దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వు  అధికంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్. ఇది గుండెకు మేలు చేస్తుంది. పక్షవాతం వంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. గుండె సమస్యలతో బాధపడేవారు ఈ బాతు కొవ్వుని ఉపయోగించడం మేలు చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటంవలన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

కిడ్నీ రక్షణ కోసం: 

ఈ ఆయిల్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్ యాసిడ్ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఎముకలకు మంచిది ఈ నూనె ఎముకలను దృఢంగా చేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ యాసిడ్ కాల్షియం శోషణను పెంచుతుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:  ప్రతి రోజూ పరిమితంగా బాతు నూనెను తీసుకోవడం వలన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మంచి సహాయకారి. రక్తపోటును నియంత్రిస్తుంది.

ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ: 

రోజూ మనం తినే ఆహారంలో రెండు స్పూన్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధుల  బారిన పడకుండా రక్షణగా నిలుస్తుంది.

ఇందులో కొవ్వు , కేలరీలు అధికంగా ఉంటాయి.. కనుక సమతుల్య ఆహారంలో భాగంగా బాతు నూనెను మితంగా ఉపయోగించడం ఉత్తమం.

ఎక్కడ లభిస్తుందంటే: 

బాతు కొవ్వును దుకాణాల్లో లేదా ఆన్‌లైన్‌లో బాతు నూనె గా లేదా వంట స్ప్రేగా కొనుగోలు చేయవచ్చు. ఇది సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా.. ఇది తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఘన రూపాన్ని కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె వలె వేడి చేసినప్పుడు ద్రవంగా నూనె రూపంలో మారుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ ఇచ్చిన సమాచారం.. పలు హెల్త్ జర్నల్స్, పరిశోధనలు , అధ్యయనాలనుంచి సేకరించి ఇచ్చినది.. అయితే ఈ బాతు నూనెను వినియోగించే ముందు ప్రముఖ వైద్యుల సలహాలను, సూచనలను తీసుకోవలసి ఉంటుంది.