Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: స్కిన్ పిగ్మెంటేషన్ దూరం చేసి యవ్వనంగా ఉంచే అద్భుత ఫలం.. క్రమం తప్పకుండా తింటే..

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వృద్దాప్య చాయలను దరిచేరనీయవు. స్కిన్ పిగ్మెంటేషన్‌ను దూరం చేస్తుంది. తామర, చర్మం దద్దుర్లు వంటి ఇతర చర్మ సంబంధ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది.

Health Benefits: స్కిన్ పిగ్మెంటేషన్ దూరం చేసి యవ్వనంగా ఉంచే అద్భుత ఫలం.. క్రమం తప్పకుండా తింటే..
Apricot
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2022 | 10:01 AM

Health Benefits: స్కిన్ పిగ్మెంటేషన్ దూరం చేసి యవ్వనంగా ఉంచే అద్భుత ఫలం.. క్రమం తప్పకుండా తింటే.. నారింజ, పసుపు రంగులో ఉంటూ కొద్దిగా ఎరుపురంగు జోడించుకుని కనిపించే మెత్తటి కండగల రుచికరమైన ఆప్రికాట్‌ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. ఇది మీ ఆహారంలో అదనంగా చేర్చుకున్నట్టయితే..మంచి ఆరోగ్యంతో పాటు..మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆప్రికాట్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబ‌ర్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సీ పుష్కలంగా ఉన్నాయి. శ‌రీరానికి కావాల్సిన అనేక న్యూట్రీషియన్స్ అందిస్తుంది. ప‌లు ర‌కాల వ్యాధులను కూడా నివారిస్తోంది.

పండు మాత్రమే కాదు, డ్రై ఆప్రికాట్‌ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. డ్రై ఆప్రికాట్ జ్యూస్ తీసుకుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా ఉంటాయి. ఎక్జిమా, దురద, తామర వంటివాటిని నివారించి కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. దాహార్తి స‌మ‌స్య ఉన్న వారుకి కూడా మంచి సొల్యూష‌న్ ల‌భిస్తుంది.ఎండిన ఆప్రికాట్ లో అధిక న్యూట్రీషియన్స్ విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి చూపున‌కు బాగా సహాక‌రిస్తుంది. డ్రై ఆప్రికాట్ పెద్ద పేగులను శుభ్రపర‌చి అందులో నిల్వ ఉన్న వ్యర్థాలను బయటకు పంపించ‌డానికి సహాయపడుతుంది. అలాగే మజిల్ ఫంక్షన్స్, హార్ట్ బీట్ ను రెగ్యులేట్ చేస్తుంది.

అప్రికాట్ పూర్తి స్థాయిలో ఫైబర్ కంటెంట్ కలిగి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఆప్రికాట్ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతూ, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ పండులో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆప్రికాట్‌లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైటోన్యూట్రియంట్స్ ఆరోగ్యవంతమైన మరియు మృదువుగా ఉండే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. ఆప్రికాట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వృద్దాప్య చాయలను దరిచేరనీయవు. తామర, చర్మం దద్దుర్లు వంటి ఇతర చర్మ సంబంధ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్‌ను దూరం చేస్తుంది. కావున, తరచుగా మీ ఆహారంలో ఆప్రికాట్ చేర్చుకోవటం ఉత్తమంగా చెబుతారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి