AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diet Tips: మీరు చేసే ‘డైట్’ పై క్లారిటీ ఉందా.. ఈ చిట్కాలు పాటిస్తే గుడ్ రిజల్ట్స్..

జంక్ పుడ్స్ కు అలవాటు పడిపోయిన మనుషులు.. ఇప్పడు ఆరోగ్యం కోసం డైట్ పేరుతో ఆహార నియమాలు పాటిస్తున్నారు. చాలా మంది సరైన డైటింగ్ ప్లాన్స్ ను డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు. అయితే చాలా మంది డైట్ చేస్తున్నా రిజల్ట్ రావడంలేదని

Diet Tips: మీరు చేసే 'డైట్' పై క్లారిటీ ఉందా.. ఈ చిట్కాలు పాటిస్తే గుడ్ రిజల్ట్స్..
Monsoon Diet
Follow us
Amarnadh Daneti

| Edited By: Team Veegam

Updated on: Aug 16, 2022 | 3:26 PM

Diet tips: జంక్ పుడ్స్ కు అలవాటు పడిపోయిన మనుషులు.. ఇప్పడు ఆరోగ్యం కోసం డైట్ పేరుతో ఆహార నియమాలు పాటిస్తున్నారు. చాలా మంది సరైన డైటింగ్ ప్లాన్స్ ను డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు. అయితే చాలా మంది డైట్ చేస్తున్నా రిజల్ట్ రావడంలేదని బాధపడుతుంటారు. రోజూ డైటింగ్ చేసిన ఫలితం రాకపోవడానికి కారణం మనం చేసే డైట్ పై మనకు క్లారిటీ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. డైటింగ్ చేసే వాళ్లు.. ఫస్ట్ ఎందుకోసం డైట్ చేస్తున్నారనే దానిపై స్పష్టత కలిగి ఉండాలి. బరువు తగ్గడం కోసం చేస్తున్నామా, అందం కోసం చేస్తున్నామా, శారీరక ధృడత్వం కోసం చేస్తున్నామా.. లేదా మరేదైనా దానికోసం చేస్తున్నామా అనే క్లారిటీ డైట్ చేసే వ్యక్తికి ఎంతో అవసరమంటున్నారు నిపుణులు.

బరువు తగ్గడం కోసం డైట్ చేసే వాళ్లు ఈచిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువుగా ఉన్న బరువును కొంత మేర తగ్గించుకోవాలనుకుంటే మొదట సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి వ్యాయమం చేయాలి. వెంటనే ఫలితం ఆశించకూడదు. రోజూ డైట్ పాటిస్తే క్రమంగా శరీరంలో మార్పు కనబడుతుంది. మీరు డైట్ చేస్తున్నా ఫలితం రావడంలేదని బాధపడదచ్చు. కాని రిజల్ట్ రావడం లేదంటే డైట్ లో తగిన ఆహారాన్ని ఎంచుకోకపోవడమే కారణం. డైట్ లో ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ స్నేహితులు ఎవరైనా చేసే డైట్ నే మీరు ఫాలో అయితే.. అది ఫలితం చూపించకపోవచ్చు. శరీరాలను బట్టి ప్రాధాన్యతలు ఉంటాయి. అందుకే డైట్ చేసే ముందు శరీర సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని తగిన ఆహారాన్ఇన ఎంచుకోవాలి.

ఇప్పటికే బరువు తగ్గేందుకు డైటింగ్ చేసినట్లయితే.. ఆసమయంలో ఎటువంటి ఆహారం తీసుకున్నాం, ఎలాంటి ఫలితం సాధించాం అనేది సమీక్షించుకోవాలి. మనకు నచ్చిన ఆహారం ఏమిటి.. నచ్చని ఆహారం ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటికి తగినట్లు మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి. మనం చేసే డైట్ లో ఫస్ట్ మనకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. దాని ద్వారా రోజూ ఆ ఆహారాన్ని తీసుకోవడం సులభమవుతుంది. మనం ఎంచుకునే డైటింగ్ మన బడ్జెట్ కు తగిన విధంగా ఎంచుకోవాలి. మన జీవనశైలికి సరిపోయేలా ఉండాలి. ఎక్కువ భోజనం రెస్టారెంట్లలో తింటున్నామా.. ఇంట్లో తింటున్నామా అనేది డైట్ లో చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఎక్కువ ఇంట్లో వండిన ఆహారం తీసకోవడానికే ప్రాధాన్యమివ్వాలి. ఇష్టం లేని ఆహారాన్ని డైట్ లో చేరిస్తే ఎక్కువ కాలం డైటింగ్ కొనసాగించలేము. ఆరోగ్యకరంకాని ఆహారాన్ని డైట్ లో తీసుకోకూడదు. మీరు డైటింగ్ లో తీసుకునే ఆహారంతో ఏదైనా ప్రమాదముందా అనేది తెలుసుకోవాలి. డైట్ చేసే వాళ్లు ఏవైనా ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దానిపై వైద్యుదిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. పై చిట్కాలు పాటించడం ద్వారా మీరు చేసే డైటింగ్ ద్వారా ఫలితం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..