Ayurveda Drugs: ఆయుర్వేద ఔషధాలను తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.. పిత్త దోషం ఉన్నవారిలో ఈ సమస్యలుంటాయంటున్న నిపుణులు

Ayurvedic medicine: ఈ సంకేతాలను సమయానికి అర్థం చేసుకుని, మీ ఆహారం, చికిత్సను ప్రారంభించినట్లయితే, ఏదైనా తీవ్రమైన వ్యాధిగా మారకుండా అడ్డుకోవచ్చు..

Ayurveda Drugs: ఆయుర్వేద ఔషధాలను తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.. పిత్త దోషం ఉన్నవారిలో ఈ సమస్యలుంటాయంటున్న నిపుణులు
Ayurveda Drugs
Sanjay Kasula

|

Aug 17, 2022 | 2:53 PM

రోజువారీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇవి ప్రారంభ దశలో చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అయితే అవి శరీరంలో పెరుగుతున్న కొన్ని తీవ్రమైన వ్యాధులను సూచిస్తున్నాయి. ఈ సంకేతాలను సమయానికి అర్థం చేసుకుని, మీ ఆహారం, చికిత్సను ప్రారంభించినట్లయితే, ఏదైనా తీవ్రమైన వ్యాధిగా మారకుండా అడ్డుకోవచ్చు. ఈ రోజు అలాంటి 5 చిన్న లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి కానీ రోజువారీ జీవితంలో సమస్యలను కలిగిస్తాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం, ప్రతి వ్యక్తికి భిన్నమైన శారీర ధర్మం ఉంటుంది. దీని కారణంగా, ప్రతి వ్యక్తి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు గురవుతాడు. దీనర్థం, వ్యక్తికి ఒకరకమైన ఔషధం తీసుకోవాలి.

ఉదాహరణకు, వాత (గాలి) సమస్యతో బాధపడేవారు- స్లిమ్, ఎనర్జిటిక్, క్రియేటివ్‌గా వర్ణించబడ్డారు. వీరి మానసిక స్థితి, చుట్టుపక్కల వ్యక్తులు, వారు తినే ఆహారాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పిట్టా, కఫా వంటి రకంతో సమానం కాని వ్యాధులు ఉంటాయి.

రాజధానిలోని చౌదరి బ్రహ్మ ప్రకాష్ ఆయుర్వేద్ చరక్ సంస్థాన్‌కు చెందినడాక్టర్ పూజా సబర్వాల్ న్యూస్ 9తో మాట్లాడుతూ.. సమస్య ఒకేటే అయినప్పటికీ చికిత్స మాత్రం విడిగా ఉంటుంది. అయితే వ్యాధికి చికిత్స చేయడానికి ఏదైనా మందులు వాడే ముందు ప్రతి వ్యక్తి  ప్రకృతి అందించే వాటి గురించి  తెలుసుకోవడం చాలా ముఖ్యం.

“ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యం వ్యాధి నివారణ. మనం వ్యాధిని ముందుగానే అంచనా వేయగలిగితే, జీవనశైలిలో చాలా ముందుగానే మార్పులు చేసుకోవడం మరియు అనారోగ్యాన్ని పూర్తిగా నివారించడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో చాలా ఒత్తిడిని తగ్గించవచ్చు.” డాక్టర్ సబర్వాల్ చెప్పారు.

డాక్టర్ హిమానీ సాగర్ చెప్పినట్లుగా.. వాత దోషం ఉన్నవారికి ఆయుర్వేదం 80 వ్యాధులను వివరిస్తుందని  అన్నారు. “పాదాలలో తిమ్మిరి, క్లబ్ ఫుట్, కండరాలలో తిమ్మిరి, సయాటికా, పెల్విక్ నొప్పి, వెన్నులో దృఢత్వం, దవడ నొప్పి, వినికిడి లోపం, తలనొప్పి, నిద్రలేమి వంటి కొన్ని వ్యాధులు అటువంటి వ్యక్తులు బాధపడుతుంటారు” అని డాక్టర్ సాగర్ వివరించారు.

అటువంటి వారికి చికిత్స చేయడానికి.. వారు తీపి, పులుపు, ఉప్పగా ఉండే ఆహారం తీసుకోవాలని అన్నారు. “ఈ వ్యక్తులు కూడా వారి ఔషధాలను వేడి నెయ్యితో కలిపి తీసుకోవాలి, వారు క్రమం తప్పకుండా వేడి సూప్‌లు, వెచ్చని పాలు తీసుకోవాలి. వారు విశ్రాంతి, క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఆయుర్వేద వైద్యుడు ఒక లేపనం సూచించినట్లయితే.. దానిని వెచ్చగా పూయాలి. వేడిగా ఉండే ఔషధ స్నానం చేయాలి” అని డాక్టర్ సాగర్ వివరించారు.

మరోవైపు, పిత్త దోషం ఉన్నవారిలో కోపం, దుఃఖం, భయం, ఒత్తిడి తీవ్రమవుతుంది. డాక్టర్ సబర్వాల్ అన్నారు. “ఉపవాసం కోసం నువ్వులు లేదా ఆవనూనెలో వండిన పులుపు, లవణం, కారం, నూనెతో కూడిన ఆహారాన్ని తినడం,పిత్త దోషం ఉన్నవారికి పెరుగు హానికరం అని అన్నారు. అటువంటి ఆహారాలు తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుందని అన్నారు.

చర్మం పసుపు రంగులోకి మారడం, తలతిరగడం, బలహీనత, జ్ఞానేంద్రియాల పనితీరు లోపం, చల్లటి ఆహారం తినాలనిపించడం, మంట, నోటిలో చేదు రుచి, విపరీతమైన దాహం, మూర్ఛ, నిద్ర తగ్గడం, కోపం వంటివి పిత్త దోషం ఉన్నవారిలో ఇవి కూడా కొన్ని లక్షణాలని పేర్కొన్నారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు దోషాలు కనిపిస్తుంటాయి. డాక్టర్ సాగర్ ఈ వ్యక్తులలో సాధారణంగా కనిపించే కొన్ని వ్యాధులను జాబితా విడుదల చేశారు.

ఆయుర్వేదంతో పిత్త దోషం

పిత్త దోషం ఉన్నవారిలో 40 రకాల వ్యాధుల ఉంటాయన్నారు. శరీరంలో బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్, విపరీతమైన చెమట, రక్తస్రావం రుగ్మతలు, హెర్పెస్, కామెర్లు, కండ్లకలక, కళ్ళు ఆకుపచ్చ లేదా పసుపు రంగు మారడం, మూత్రం లేదా మలం వాటిలో కొన్ని లక్షణాలు. వీటితో పాటు, తలతిప్పడం, మత్తుగా అనిపించడం. నోరు పొడిబారడం, మతిమరుపు, విరేచనాలు, అనోరెక్సియా, జ్వరం కూడా ఉండవచ్చు” అని డాక్టర్ సాగర్ చెప్పారు.

పిత్త దోషాల కు చికిత్స ఎలా చేయాలో డాక్టర్ సబర్వాల్  వివరించారు. వెన్న ( నెయ్యి ),పాలు తినాలని అన్నారు. “వారు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్-సేన్టేడ్ సబ్బుతో స్నానం చేసి, చర్మానికి చందనం పూయాలి. పార్కుల్లో, సరస్సు లేదా నది ఒడ్డున నడవండి. ఇలా చేయడం ద్వారా వారు అనేక వ్యాధులను అరికట్టవచ్చు.

వ్యాధులు కఫాలో అనోరెక్సియా, మగత, నీరసం , అజీర్ణం, గాయిటర్ మరియు స్థూలకాయం వంటివి ఉన్నాయి. “వ్యాయామం, ఆహారంలో గోధుమలు మరియు తేనెతో సహా మరియు పగటిపూట నిద్రకు దూరంగా ఉండటం, కఫా దోష వ్యాధులకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు.” డాక్టర్ సబర్వాల్ ముగింపులో తెలిపారు.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu