FSI Recruitment 2022: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో కొలువులు సాధించే అవకాశం.. అర్హులెవరంటే..

కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (Forest Survey of India).. ఒప్పంద ప్రాతిపదికన 11 టెక్నికల్ అసోసియేట్, ప్రోగ్రామర్ (Tecnical Associate Posts) పోస్టుల..

FSI Recruitment 2022: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో కొలువులు సాధించే అవకాశం.. అర్హులెవరంటే..
Forest Survey Of India
Follow us

|

Updated on: Oct 13, 2022 | 3:12 PM

Dehradun Forest Survey of India Technical Associate Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (Forest Survey of India).. ఒప్పంద ప్రాతిపదికన 11 టెక్నికల్ అసోసియేట్, ప్రోగ్రామర్ (Tecnical Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంఏ(జియోగ్రఫీ), డిప్లొమా/రిమోట్ సెన్సింగ్/ జీఐఎస్‌లో సర్టిఫికేట్ కోర్సు లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో నోటిపికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 40 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 25, 2022 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.