Viral Video: దశాబ్ధపు వింత! చేపలు, పీతలకు కూడా కరోనా టెస్టులు.. నెట్టింట పేలుతున్న సెటైర్లు!

మనుషులకే కాకుండా చేపలు, పీతలకు కూడా కోవిడ్‌ టెస్టులు చేస్తోంది ఈ దేశ ప్రభుత్వం. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు. ఎంతైనా చైనా కదా! ఆ మాత్రం షాక్‌ ఉంటుంది..

Viral Video: దశాబ్ధపు వింత! చేపలు, పీతలకు కూడా కరోనా టెస్టులు.. నెట్టింట పేలుతున్న సెటైర్లు!
Covid 19 Test For Fish
Follow us

|

Updated on: Aug 19, 2022 | 5:25 PM

Chinese officials swabbing fish mouths for COVID-19 amid rise in cases: గడచిన రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది. కరోనా ముందు.. కరోనా తర్వాత అనే పరిస్థితి నెలకొంది. తాజాగా కరోనా వైరస్‌ పుట్టిల్లు చైనాలో మనుషులకే కాకుండా చేపలు, పీతలకు కూడా కోవిడ్‌ టెస్టులు చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు. ఎంతైనా చైనా కదా! ఆ మాత్రం షాక్‌ ఉంటుంది..

చైనా తీర ప్రాంత నగరమైన జియామెన్‌లో మత్స్యాకారులులతోపాటు, వాళ్లు పట్టిన చేపలు, పీతలకు కూడా ప్రతి రోజూ కోవిడ్ -19 టెస్టులు నిర్వహిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. జీరో కోవిడ్‌ లక్ష్యంగా దేశంలోకి ఒక్క కరోనా కేసు కూడా ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఈ ప్రత్యేక చర్యలకు పూనుకున్నట్లు అక్కడి మీడియా సంస్థలు తెల్పుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లే చైనా మత్స్యాకారులు ఇల్లీగల్ ట్రేడర్స్‌తో సంబంధాలు పెట్టుకుంటున్నారని, వారి వల్ల దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించే అవకాశం ఉందని.. అందువల్లనే మత్స్యాకారులకు, వారు పట్టిన చేపలకు కరోనా టెస్టులు చేస్తున్నట్లు మీడియా కథనాలు తెల్పుతున్నాయి. ఐతే ఇంతవరకు పాజిటివ్‌ కేసులు ఒక్కటి కూడా నమోదుకాకపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించి చేపలకు కోవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్న వీడియోను సౌత్‌ చైనా మార్కింగ్‌ పోస్ట్‌ అనే యూజర్ పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్‌ అయ్యింది. మిలియన్ల కొద్ది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. మరికొందరైతే చురకలతో చమత్కారాలు పేలుస్తున్నారు. ‘ఈ దశాబ్ధపు వింత ఇది’ అని ఒకరు, ‘హెల్త్‌ కోడ్ సిస్టమ్‌లో సముద్ర జీవులను కూడా ఖచ్చితంగా చేర్చాలి. సముద్రం ద్వారా చైనా భూభాగంలోకి ప్రవేశించే చేపలను 7 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలి’ అని మరొకరు ఈ వీడియోపై సరదాగా జోకులు పేలుస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో వైపు ఓ లుక్కేసుకోండి..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..