Banana Flower: అరటి పువ్వు తింటే ఎన్ని లాభాలో! యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ ఇంకా..
అరటి చెట్టు ప్రతి ఇంటి పెరట్లో ఉంటుంది. అరటి ఆకులు, పువ్వు, అరటి గెలలు.. ప్రతిదీ మనకెందో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరటి పువ్వును పండులాగా పచ్చిగా తినలేం..
Updated on: Aug 19, 2022 | 7:25 PM

అరటి చెట్టు ప్రతి ఇంటి పెరట్లో ఉంటుంది. అరటి ఆకులు, పువ్వు, అరటి గెలలు.. ప్రతిదీ మనకెందో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరటి పువ్వును పండులాగా పచ్చిగా తినలేం. దీనితో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తినడం మనకు కొత్తేమీకాదు. ఐతే అరటి పువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలు ఎన్నున్నాయో మీకు తెలుసా..

అరటి పువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, మినరల్స్ కంటెంట్ కూడా ఎక్కువే. మోచా లేదా అరటి పువ్వులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.

అరటి పువ్వులో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే మూసా సాపియంటం అనే సమ్మేళనం ఉంటుంది. ఐతే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

అరటి పువ్వులో క్వెర్సెటిన్, కాటెచిన్ సమ్మేళనాలు అధికగా ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. కార్బోహైడ్రేట్లను గ్రహించగలదు.

అరటి పువ్వు పేగు ఆరోగ్యానికి ఎతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది. గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో జింక్‌లో అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.





























