Viral Video: హీరోలా ప్రపోజ్ చేయాలనుకున్నాడు.. సెకన్లలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాకే..

Viral Video: ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు ప్రేముకు రకరకాల విధానాలు అవలంభిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో ప్రపోజ్ చేస్తారు.

Viral Video: హీరోలా ప్రపోజ్ చేయాలనుకున్నాడు.. సెకన్లలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాకే..
Viral Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2022 | 10:04 PM

Viral Video: ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు ప్రేముకు రకరకాల విధానాలు అవలంభిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో ప్రపోజ్ చేస్తారు. కొందరైతే తమ ప్రపోజల్ లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేలా వినూత్న ప్రయోగాలు చేస్తారు. సాధారణంగా చాలా మంది మోకాళ్లపై కూర్చుని ఫ్లవర్ గానీ, రింగ్ గానీ ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి తన ప్రేమను ప్రేయసికి వ్యక్తం చేయబోయాడు. అందరి ముందే ప్రపోజ్ చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకోవడమే కాదు.. ప్రపోజ్ కూడా చేశాడు. అయితే, ఆ ప్రపోజ్ చేసే సమయంలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు అయ్యో అంటూ సానుభూతి తెలుపుతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ అథ్లెట్ తన గర్ల్ ఫ్రెండ్‌కు స్టేడియంలోనే ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్లుగానే ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. పెవిలియన్‌కు వచ్చాక.. తన ప్రేయసిని హగ్ చేసుకున్నాడు. చేతిలో ఉంగరం తీసి.. ఆమెకు మోకాళ్లపై ప్రపోజ్ చేయాలని భావించాడు. అనుకున్నట్లుగానే.. మోకాళ్లపై కూర్చుని రింగ్ తీశాడు. కానీ, ఇంతలోనే అతని కాలి కండరాలు పట్టేశాయి. దాంతో అతను కుప్పకూలిపోయాడు. పక్కనే ప్రేయసి.. అతనికి ఏమవుతుందో తెలియదని ఆయోమయానికి గురైంది. చివరకు ఇద్దరు సిబ్బంది సాయంతో.. తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. తనకు నిల్చునే శక్తి లేకపోయినా.. ప్రపోజ్ చేయడంతో అబ్బురపడిపోయింది యువతి. అతని ప్రేమను యాక్సెప్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. 3.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..