Viral: ఫేస్‌బుక్‌ పోస్టుగా గర్ల్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటో.. కట్ చేస్తే.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్..

వారిద్దరూ గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకదాన్ని..

Viral: ఫేస్‌బుక్‌ పోస్టుగా గర్ల్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటో.. కట్ చేస్తే.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్..
Facebook Post
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 20, 2022 | 5:59 PM

వారిద్దరూ గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకదాన్ని ప్రియుడు ముచ్చటపడి తన ఫేస్‌బుక్‌ పోస్టుగా పెట్టుకున్నాడు. కట్ చేస్తే.. వాళ్ల లవ్ స్టోరీలో తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇంతకీ అదేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని పతరబిన్ టోలి గ్రామానికి చెందిన లహ్వార్ కుమార్.. అదే గ్రామానికి చెందిన మౌనిక(పేరు మార్చాం)తో గత కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇంట్లో తెలియకుండా బయట కలుసుకునేవారు. ఇద్దరూ కలిసి ఎన్నో ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే లహ్వార్ ముచ్చటపడి.. తన గర్ల్‌ఫ్రెండ్‌తో దిగిన ఓ ఫోటోను ఫేస్‌బుక్ పోస్టుగా పెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. వాళ్ల లవ్ స్టోరీ కాస్తా క్లైమాక్స్‌కు చేరింది.

ఆ ఒక్క పోస్టుతో వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఊరంతా తెలిసిపోయింది. గురువారం(అనగా 18వ తేదీన) ఏదో పని మీద బయటికి వెళ్లిన లహ్వార్ కుమార్.. అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. దీనితో అతడి కుటుంబసభ్యులు ఒక్కసారిగా కంగారుపడిపోయారు. ఊరంతా వెతికినా అతడి జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు శుక్రవారం నదిలోకి చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు లహ్వార్ కుమార్ మృతదేహం చిక్కింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, లహ్వార్ కుమార్ మిస్సయిన రాత్రి నుంచి అతడి ప్రియురాలి కుటుంబం ఇంటికి తాళం పెట్టి ఉండటంతో.. మృతుడి కుటుంబ సభ్యులు వాళ్ళే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..