Ramya Krishna: ఈ గ్లామర్ క్వీన్ కి అన్నగా, భర్తగా, తండ్రిగా నటించిన నటుడు, సినిమాలు ఏమిటో తెలుసా..!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. బాహుబలి సినిమాలో శివగామిగా తన నట విశ్వరూపం చూపించిన రమ్య కృష్ణ వయసుతగిన పాత్రల్లో నటిస్తోంది. అయితే రమ్యకృష్ణ ఒక నటుడికి చెల్లెలుగా, భార్యగా, కూతురుగా నటించింది.

Ramya Krishna: ఈ గ్లామర్ క్వీన్ కి అన్నగా, భర్తగా, తండ్రిగా నటించిన నటుడు, సినిమాలు ఏమిటో తెలుసా..!
Ramya Krishna
Follow us
Surya Kala

|

Updated on: Aug 19, 2022 | 2:04 PM

Ramya Krishna: సినీ నటులంటే ప్రజల్లో ఉండే క్రేజ్ వేరు.. ఆకాశంలోని తారల్లా భావిస్తారు.. ఎంతగానో అభిమానిస్తారు. మరికొందరు.. తమ అభిమాన నటీనటుల్లా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని.. సినీ పరిశ్రమలో అడుగు పెడతారు కూడా.. అయితే స్టార్ హీరోలు, హీరోయిన్స్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారు ఈరోజు ఈ స్టేజ్ కు చేరుకోవడానికి కెరీర్ మొదట్లో అష్టకష్టాలు పడినవారు ఎందరో ఉన్నారు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. అందివచ్చిన అవకాశాలతో తమని తాము ప్రూవ్ చేసుకుని.. క్రమక్రమంగా స్టార్ నటీనటులుగా మారినవారిలో రమ్య కృష్ణ ఒకరు.. సినీ  పరిశ్రమలో రమ్యకృష్ణ జర్నీ అంత సులభంగా సాగలేదు. తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించిన రమ్య కృష్ణ.. 1986 లో భలేమిత్రులు సినిమాతో తెలుగు వెండి తెరపై అడుగు పెట్టింది. అల్లుడుగారు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. ఐరెన్ లెగ్ నుంచి అదృష్ట దేవతగా మారింది. అప్పట్లో తన గ్లామర్‌తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. బాహుబలి సినిమాలో శివగామిగా తన నట విశ్వరూపం చూపించింది.  రమ్యకృష్ణ ఇప్పటికీ వయసుతగిన పాత్రల్లో నటిస్తోంది. అయితే రమ్యకృష్ణ ఒక నటుడికి చెల్లెలుగా, భార్యగా, కూతురుగా నటించింది. మరి ఆ నటుడు ఎవరో తెలుసా..

దక్షిణాది సీనియర్ యాక్టర్ నాజర్ కు రమ్యకృష్ణ చెల్లెళ్లుగా, భార్యగా, కూతురుగా నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ … నాజర్ కు చెల్లెలుగా నటించింది.

Ramaya Krishna 1

Ramaya Krishna

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా బాహుబలి లో రమ్యకృష్ణ ..రానా, ప్రభాస్ లకు తల్లిగా నాజర్ కు భార్యగా నటించింది.

ఇవి కూడా చదవండి
Ramaya Krishna 2

Ramaya Krishna

టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేది కోలీవుడ్ లో వంత రాజవతన్ వరువేన్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో బోమన్ ఇరాన్ నటించిన పాత్రలో నాజర్ నటించగా.. నదియా క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటించారు.

Ramaya Krishna 3

Ramaya Krishna

ఇలా వెండి తెరపై అన్నా చెల్లెలు, భార్యాభర్తలు, తండ్రి కూతురుగా నటించిన నటులుగా రామకృష్ణ, నాజర్ లు నిలిచారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..