Liger Movie: అప్పు సమాధిని దర్శించుకున్న లైగర్‌ టీం.. పునీత్‌కు ఘన నివాళులు

టాలీవుడ్‌ రౌడీ బాయ్  విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) సమాధిని దర్శించుకున్నాడు. ఈరోజు బెంగళూరు వెళ్లిన అతను కంఠీరవ స్టేడియానికి వెళ్లారు. అక్కడ అప్పు సమాధిని దర్శించుకుని..

Liger Movie: అప్పు సమాధిని దర్శించుకున్న లైగర్‌ టీం.. పునీత్‌కు ఘన నివాళులు
Vijay Deverakonda
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2022 | 2:33 PM

టాలీవుడ్‌ రౌడీ బాయ్  విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) సమాధిని దర్శించుకున్నాడు. ఈరోజు బెంగళూరు వెళ్లిన అతను కంఠీరవ స్టేడియానికి వెళ్లారు. అక్కడ అప్పు సమాధిని దర్శించుకుని దివంగత కన్నడ సూపర్‌స్టార్‌కు ఘనంగా నివాళి అర్పించారు. అతని వెంట హీరోయిన్‌ అనన్యా పాండే, దర్శకుడు పూరి జగన్నాథ్‌ తదితరులు ఉన్నారు. కాగా గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు పునీత్‌. పేరుకు కన్నడ నటుడైనా ఆయనకు అన్ని భాషల చిత్ర పరిశ్రమలతో మంచి అనుబంధం ఉంది. ఇక పునీత్ రాజ్‌కుమార్ తొలిసారి హీరోగా పరిచయమైన అప్పు (తెలుగులో ఇడియట్‌) చిత్రానికి కూడా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఆతర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో పలు సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి.

కాగా విజయ్‌- పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్‌ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగానే ప్రస్తుతం బెంగళూరులో పర్యటిస్తోంది. కాగా ఈ సినిమాలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించడం విశేషం. అతని తల్లిగా రమ్యకృష్ణ నటించింది. దిగ్గజ బాక్సర్ మైక్‌టైసన్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ స్పోర్ట్స్‌ డ్రామాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే