Samantha: సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయిన సామ్‌.. అదే కారణమంటోన్న నెటిజన్స్‌

సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో సమంత (Samantha) ఒకరు. తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకుంటుందీ అందాల తార. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు,

Samantha: సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయిన సామ్‌.. అదే కారణమంటోన్న నెటిజన్స్‌
Samantha
Follow us
Basha Shek

|

Updated on: Aug 18, 2022 | 4:29 PM

సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో సమంత (Samantha) ఒకరు. తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకుంటుందీ అందాల తార. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వర్కవుట్స్ ఫొటోలు, వెకేషన్‌ పిక్స్‌తో పాటు హెల్దీ అండ్‌ ఫిట్‌నెస్‌ టిప్స్‌ను షేర్‌ చేసుకుంటుంది. బ్రాండ్‌ ప్రమోషన్స్‌లోనూ ముందుంటుంది. ఇలా నెట్టింట్లో చురుకుగా ఉండే సామ్‌ ఈ మధ్యకాలంలో పూర్తిగా సైలెంట్‌ అయినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఎప్పుడో ఒకసారి అది కూడా ఎంతో ముఖ్యమైన అప్‌డేట్స్‌ మాత్రమే షేర్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే జులై 21న ఇన్‌స్టాగ్రామ్‌లో చివరి పోస్ట్‌ పెట్టింది సమంత. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క పోస్ట్‌ కూడా లేదు.

దీంతో అసలు సామ్‌కు ఏమైంది? ఎందుకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటోందోనన్న సందేహం అభిమానులను కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే నాగచైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట్లో చాలా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోందీ అందాల తార. ఆ మధ్యన కాఫీ విత్‌ కరణ్‌ షోకు హాజరై మాజీ భర్త చైతూపై కొన్ని షాకింగ్‌ కామెంట్స్ చేసింది. అలాగే థ్యాంక్యూ, లాల్‌సింగ్‌ చద్దా ప్రమోషన్లలో భాగంగా సమంతతో రిలేషన్‌షిప్‌పై తన వెర్షన్‌ వినిపించే ప్రయత్నం చేశాడు చైతన్య. ఈక్రమంలోనే ట్రోలర్స్‌, నెగెటివ్‌ కామెంట్స్‌ కారణంగానే సామ్‌ ఇలా నెట్టింటికి దూరంగా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సామ్‌ ఎందుకీ నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ.. ఆమె ఫ్యాన్స్‌ మాత్రం ఒక ఫొటో లేదా అప్డేట్‌ ప్లీజ్‌ అంటూ కలల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిగా కాతువాకుల రెండు కాదల్‌ అనే సినిమాలో కనిపించింది సమంత. ప్రస్తుతం ఆమె చేతిలో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు ఉన్నాయి. అలాగే వరుణ్‌ ధావన్‌ సరసన ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!