Virat Kohli: ఆ సమయంలో చుట్టూ ప్రేమించేవాళ్లున్నా.. ఒంటరిగా ఫీలయ్యాను: కింగ్‌ కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడైన విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో పరుగుల వరద పారించిన ఈ స్టార్‌ ప్లేయర్‌ ప్రస్తుతం ఫామ్‌ లేమితో సతమతవుతున్నాడు.

Virat Kohli: ఆ సమయంలో చుట్టూ ప్రేమించేవాళ్లున్నా.. ఒంటరిగా ఫీలయ్యాను: కింగ్‌ కోహ్లీ
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Aug 17, 2022 | 10:06 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడైన విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో పరుగుల వరద పారించిన ఈ స్టార్‌ ప్లేయర్‌ ప్రస్తుతం ఫామ్‌ లేమితో సతమతవుతున్నాడు. ప్రస్తుతం ఆసియాకప్‌ కోసం సిద్ధమవుతోన్న కోహ్లీ తిరిగి మునపటి ఫామ్‌ను కొనసాగేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. శారీరకంగా, మానసికంగా ఫిట్‌ అయ్యేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడు. కాగా గతంలో పలుసార్లు మానసిక ఆరోగ్య సమస్యలపై స్పందించిన విరాట్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అథ్లెట్లకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానిని భరించడం కష్టమన్నాడు. అలాంటి అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు.

‘ఒక క్రీడాకారుడిగా మానసిక ఒత్తిడిని భరించడం చాలా కష్టం. సాధారణంగా అథ్లెట్‌ ఒక ఆటగాడిగా ఉత్తమ ఫలితాలు తీసుకురావాలి. ఆ సమయంలో ఉండే ఒత్తిడి మన మానసిక ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావం చూపిస్తుంది. అలాంటి అనుభవం నాకూ ఎదురైంది. ఒకనొక దశలో చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లు ఉన్నప్పటికి ఒంటరిగా ఫీలయ్యాను. ఒత్తిడిని దరి చేరనీయకుండా ఉండాలంటే కసరత్తులపై దృష్టి పెట్టాలి. మంచి ఫిట్‌నెస్‌ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం చేయాలనుకుంటున్న పనిపై కూడా శ్రద్ధ పెరుగుతుంది. గదిలో నా చుట్టూ ఉన్నవాళ్లంతా నన్ను ప్రేమించేవాళ్లే. క్లిష్ట పరిస్థితుల్లో నాకు అండగా నిలబడేవాళ్లు. అయినా కూడా ఒంటరిగా ఫీలయ్యాను. ఎవరితోనూ సరిగ్గా కలవలేకపోయాను. అయితే ఆ తర్వాత నాకు నేను సర్దిచెప్పుకున్నాను. అందరితో కలిసిపోయాను. మన మూడ్‌ సరిగా లేకపోయినప్పటికీ నిరంతరం అందరితో మంచి రిలేషన్‌ కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే మనకున్న ఒత్తిడి దూరమవుతుంది’ అని చెప్పుకొచ్చాడు కోహ్లీ.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..