Liam Livingstone: ఇంగ్లిష్ స్టార్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్దగా పరిచయం అవసరం లేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మెరుపులు మెరిపించే ఈ స్టార్ ప్లేయర్ భారత అభిమానులకు కూడా సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ లీగ్‌లో అతను పంజాబ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్రీజులోకి రాగానే సుడిగాలిలా చెలరేగే లివింగ్ స్టోన్ అలవోకగా సిక్సర్లు బాదడంలో దిట్ట. అలా తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అటు ఇంగ్లండ్ జట్టుకు, ఇటు ఐపీఎల్‌లో పంజాబ్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడీ డ్యాషింగ్ క్రికెటర్. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీలోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో చేలరేగుతున్నాడు. తాజాగా ట్రెంట్ రాకెట్స్‌తో సోమవారం ఎడ్జ్‌బాస్టన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 32 బంతుల్లో అజేయంగా 51 రన్స్ చేశాడు. ఇందులో ఏకంగా 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే ఒంటి చేత్తో కొట్టిన ఓ భారీ సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
146 లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు మరో 14 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది. 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును లివింగ్ స్టోన్, కెప్టెన్ మొయిన్ అలీ ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. ముఖ్యంగా లివింగ్ స్టోర్ సిక్సర్లతో చెలరేగాడు. అలవోకగా భారీ సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత చేశాడు. చివరకు అతను సిక్సర్‌తోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. అది కూడా ఒంటి చేత్తో. డేనియల్ సామ్స్ వేసిన ఫుల్‌టాస్ బంతిని లాంగాన్ మీదుగా నేరుగా స్టాండ్స్‌లోకి తరలించి అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ తరఫున అలీ కూడా అర్ధ సెంచరీ సాధించాడు.
Use an emoji to describe the striking from this pair!