AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా? ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ పర్సన్

అప్పుడుప్పుడు సినిమా దర్శకులు, నిర్మాతలు కూడా కెమెరా ముందుకొస్తుంటారు. హీరోలతో పాటుగా సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తుంటారు. అలా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రో బ్యాక్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Tollywood:నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా? ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ పర్సన్
Harish Shankar
Basha Shek
|

Updated on: Mar 16, 2026 | 8:38 AM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతను చిన్నప్పుడే స్టేజ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత స్క్రీన్ రైటర్ గా మారిపోయాడు. ప్రముఖ రచయిత యండమూరి రవీంద్రనాథ్ స్ఫూర్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కోనా వెంకట్, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. నిన్నే ఇష్టపడ్డాను, నా ఆటో గ్రాఫ్, ఏ ఫిల్మ్ బై అరవింద్, బుజ్జిగాడు, చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిప్పు తదితర సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత తానే మెగా ఫోన్ పట్టి రవితేజతో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీశాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే అతని టేకింగ్, డైరెక్షన్ కు ఫిదా అయిన రవితేజ మళ్లీ అతనికే తన సినిమా ఛాన్స్ ఇచ్చాడు. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా ఇప్పుడు మళ్లీ అదే పవర్ స్టార్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అతనెవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. పై ఫొటోలో ఉన్నది ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్.

ఇవి కూడా చదవండి

తన కెరీర్ లో ఎక్కువగా రీమేకులే చేశాడు హరీశ్ శంకర్. అయితే ఒరిజినల్ కన్నా అద్బుతంగా తీయగలడనే ప్రశంసలు అందుకున్నాడు. గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేశ్ సినిమాలే ఇందుకు నిదర్శనం. మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ అందుకున్న హరీశ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో హరీశ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే చాలా సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. క్యామియో పాత్రల్లో మెప్పించాడు. నిన్నే ఇష్టపడ్డాను, అందరివాడు, ఏ ఫిల్మ్ బై అరవింద్, మొదటి సినిమా, నేనింతే, సమ్మోహనం చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేశాడు హరీశ్ శంకర్.

గబ్బర్ సింగ్ రోజుల్లో హరీశ్ శంకర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?