AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetables Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. పడిపోయిన టమాట ధరలు.. కిలో ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గాయి. టమాట తక్కువకే లభిస్తున్నాయి. ఇక వంకాయ ధరలు కూడా పడిపోయాయి. టమాట దిగుబడి ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది ధరలు తగ్గాయి. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే వస్తుండగా.. రైతులు మాత్రం నష్టాల పాలవుతున్నారు.

Vegetables Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. పడిపోయిన టమాట ధరలు.. కిలో ఎంతంటే..?
Vegetables Market
Venkatrao Lella
|

Updated on: Mar 16, 2026 | 8:26 AM

Share

సామాన్యులకు కూరగాయల ధరలు ఊరట కలిగించాయి. మార్కెట్లో టమాట, వంకాయ ధరలు తగ్గాయి. రైతు మార్కెట్లలో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు బెండకాయ, పచ్చిమిర్చి ధరల్లో మాత్రమే పెరుగుదల నమోదైంది. టమాట, వంకాయ ధరలు గత కొద్ది నెలలుగా పడిపోతూ వస్తోన్నాయి. టమాట ధరలు అయితే ఆమాంతం తగ్గిపోయాయి. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే లభిస్తుండగా.. ధరలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

హైదరాబాద్ రైతు మార్కెట్‌లో..

కూకట్ పల్లిలోని రైతు బజార్‌లో కిలో టమాట రూ.11, వంకాయ రూ.18, బెండకాయ రూ.35 పచ్చిమిర్చి రూ.45, బజ్జిమిర్చి రూ.18, కాకరకాయ రూ.23, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.12, బీన్స్ రూ.40 పలుకుతోంది. క్యారెట్ రూ.18, గోబి పువ్వు రూ.25, దొండకాయ రూ.35, చిక్కుడు కాయ రూ.35, గోరు చిక్కుడు రూ.28, బీట్‌రూట్ రూ.18, క్యాప్సికం రూ.44, ఆలుగడ్డ రూ.18, కీర రూ.18గా కొనసాగుతోంది. దోసకాయ రూ.13, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.18కి విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డ రూ.20, చిలగడ దుంప రూ.25కి అమ్ముతున్నారు.

విజయవాడలో ఇలా..

విజయవాడలో కిలో టమాట రూ.13, వంగ రూ.19, బెండకాయ రూ.19, పచ్చిమిర్చి రూ.24, కాకరకాయ రూ.18, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.26, దొండకాయ రూ.25, బంగాళదుంప రూ.23, ఉల్లిపాయ రూ.22, గోరుచిక్కుడు రూ.22, దోసకాయ రూ.18, సొరకాయ రూ.11, చిక్కుళ్లు రూ.24, బీరకాయ రూ.22, చామదుంప రూ.26, బీట్ రూట్ రూ.24, కీరదోస రూ.36, బీన్స్ రూ.70, క్యాప్చికమ్ రూ.56, అలసందలు రూ.24, చిలకడదుంప రూ.24కి రైతు బజార్లలో విక్రయిస్తున్నారు.

గుంటూరులో ధరలు ఇవే..

ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో కిలో టమాట రూ.11, వంట రూ.16, బెండకాయ రూ.25, పచ్చిమిర్చి రూ.26, కాకరకాయ రూ.30, క్యారెట్ రూ.27, క్యాబేజీ రూ.17, బీరకాయ రూ.30, దొండకాయ రూ.27, బంగాళదుంప రూ.30, ఉల్లిపాయలు రూ.22, గొరుచిక్కుడు రూ.24, దోసకాయ రూ.17, పొట్లకాయ రూ.24. చామదుంప రూ.25, క్యాప్చికం రూ.50, సొరకాయ రూ.10, బీన్స్ రూ.75, కీర రూ.39, బీట్ రూట్ రూ.25కి అమ్ముతున్నారు.

Follow Us