Viral Video: మైదానంలో పుజారా మెరుపులు.. గ్యాలరీలో నాలుగేళ్ల కూతురు ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

Cheteshwar Pujara: ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మార్చి నుంచి ఇంగ్లండ్‌లోనే ఉన్న మన నయావాల్‌..

Viral Video: మైదానంలో పుజారా మెరుపులు.. గ్యాలరీలో నాలుగేళ్ల కూతురు ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్
Cheteshwar Pujara
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2022 | 8:44 AM

Cheteshwar Pujara: ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మార్చి నుంచి ఇంగ్లండ్‌లోనే ఉన్న మన నయావాల్‌.. ససెక్స్ తరఫున సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టేస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ పుజారా 2 డబుల్ సెంచరీలతో సహా మొత్తం 5 సెంచరీలు బాదేశాడు. ఇప్పుడు వన్డే టోర్నమెంట్‌లోనూ తన సూపర్‌ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో వరుసగా రెండు శతకాలు నమోదుచేశాడు. నాలుగు రోజుల క్రితం వార్విక్‌షైర్‌పై 79 బంతుల్లో 107 పరుగులు చేసిన పుజారా…ఆదివారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో అంతకుమించి అనేలా చెలరేగి పోయాడు. కేవలం 131 బంతుల్లో 174 రన్స్‌ సాధించి త్రుటిలో డబుల్‌ సెంచరీ కోల్పోయాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండడం విశేషం. కాగా ఇన్నింగ్స్‌ చివర్లో ఔటై పెవిలియన్‌కు తిరిగి వస్తున్న నయావాల్‌ ను ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇదే సమయంలో పుజారా నాలుగేళ్ల కుమార్తె కూడా మ్యాచ్‌ను చూస్తూ తెగ సంబరపడిపోయింది. తన తండ్రిని అభినందిస్తూ డ్యాన్స్‌ చేస్తూ చప్పట్లు కొట్టింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara)

తన గారాల పట్టికి సంబంధించిన వీడియోను పుజారా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది . ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. పుజారాతో పాటు టామ్‌ క్లార్క్‌ (104) సెంచరీతో మెరిశాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 రన్స్‌ కే కుప్పకూలింది. దీంతో 216 పరుగుల భారీ తేడాతో ససెక్స్‌ విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే