Viral Video: నడి రోడ్డుపై మహిళ ఓవరాక్షన్‌.. రిక్షాడ్రైవర్‌ చొక్కా పట్టుకుని 17 చెంపదెబ్బలు.. సీన్‌ కట్‌ చేస్తే

Shocking Video: ఇటీవల కొందరు అమ్మాయిలు చిన్న చిన్న ఘటనలకు కూడా ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతున్నారు. తమ వాహనాలకు అడ్డోచ్చారంటూ క్యాబ్‌ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను చితక బాదుతున్నారు. రోడ్లపైనే రచ్చ రచ్చ చేస్తూ..

Viral Video: నడి రోడ్డుపై మహిళ ఓవరాక్షన్‌.. రిక్షాడ్రైవర్‌ చొక్కా పట్టుకుని 17 చెంపదెబ్బలు.. సీన్‌ కట్‌ చేస్తే
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2022 | 10:11 AM

Shocking Video: ఇటీవల కొందరు అమ్మాయిలు చిన్న చిన్న ఘటనలకు కూడా ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతున్నారు. తమ వాహనాలకు అడ్డోచ్చారంటూ క్యాబ్‌ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను చితక బాదుతున్నారు. రోడ్లపైనే రచ్చ రచ్చ చేస్తూ అటు ట్రాఫిక్‌కు, ఇటు వాహన దారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఓ అమాయక ఈ రిక్షా డ్రైవర్‌తో ఓ మహిళ విచక్షణా రహితంగా ప్రవర్తించింది. నోయిడాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నోయిడాలో ఈరిక్షా పొరపాటున మారుతి వేగన్‌ ఆర్‌ కారుకు తగిలింది. అంతే కారు నడుపుతున్న మహిళకు తెగ కోపమొచ్చేసింది. రిక్షా డ్రైవర్‌ చొక్కా పట్టుకుని రోడ్డుపై అటూ ఇటూ తిప్పుడూ తిట్ల దండకం అందుకుంది. ఆతర్వాత ఎడాపెడా చెంపదెబ్బలు వాయించింది. కేవలం 90 సెకన్లలో వ్యవధిలోనే 17 సార్లు రిక్షాడ్రైవర్‌ను లెంపకాయలు కొట్టిందంటే ఆ మహిళ ఎంత దారుణంగా ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు.

చివరకు జైల్లో..

ఇవి కూడా చదవండి

మరోవైపు రోడ్డుపై అందరూ తననే చూస్తుండడంతో రిక్షా డ్రైవర్‌ చేతులు జోడించి క్షమాపణలు అడిగాడు. అయినా.. ఆ మహిళ కాస్తైనా కనికరం చూపలేదు. చొక్కా కాలర్ పట్టుకుని కారుని టచ్ చేసిన గుర్తుల్ని చూపిస్తూ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోలీసుల దాకా ఈ విషయం చేరడంతో నోయిడా పోలీసులు స్పందించారు. బహిరంగంగా ఈ రిక్షా డ్రైవర్‌ను కొట్టిన ఘటనలో మహిళను అరెస్టు చేశామని తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్