Bipasha Basu: ఇట్స్‌ అఫిషియల్‌.. తల్లి కాబోతున్న హీరోయిన్‌.. ముగ్గురం కాబోతున్నామంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Bipasha Basu- Karan Singh Grover: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బ్యూటీ బిపాషా బసు తన ఫ్యాన్స్‌కు శుభార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది

Bipasha Basu: ఇట్స్‌ అఫిషియల్‌.. తల్లి కాబోతున్న హీరోయిన్‌.. ముగ్గురం కాబోతున్నామంటూ ఎమోషనల్‌ పోస్ట్‌
Bipasha Basu
Follow us
Basha Shek

|

Updated on: Sep 11, 2022 | 10:07 AM

Bipasha Basu- Karan Singh Grover: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాషా బసు తన ఫ్యాన్స్‌కు శుభార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో రొమాంటిక్‌ పోజుల్లో దిగిన ఫొటోలను పంచుకుంటూ త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు ఓ ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్ చేసింది. మా లైఫ్‌లోకి మరింత సంతోషం రానుంది. మా మాధ్య ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మా ఇంట్లోకి అడుగుపెట్టనుంది. మీరు మాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞురాలిని’ అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చింది బిపాసా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు బిపాసా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

కాగా జిస్మ్‌, ధూమ్‌ సిరీస్‌ సినిమాల్లో అందాలు ఆరబోసి కుర్రకారు హృదయాల్లో కల్లోలం రేపింది బిపాసాబసు. హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మహేశ్‌ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో సందడి చేసిందీ బెంగాలీ బ్యూటీ. కాగా ఈ అందాల తార చివరిసారిగా 2015లో ఎలోన్‌ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన కరణ్‌సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడిందామె. కొన్ని నెలల పాటు డేటింగ్‌ చేసిన ఈ జోడీ 2016లో పెద్దల అనుమతితో కలిసి పెళ్లిపీటలెక్కారు. వారి ఆరేళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు లవ్లీ కపుల్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు