AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి క్రేజీ సింగర్‌! భారీ రెమ్యునరేషన్ తో ఎంట్రీ! ఇంతకీ ఆమె ఎవరంటే?

Mohana Bhogaraju: బుల్లితెర రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీతో మొదలైన ఈ గేమ్‌షో అన్ని భాషల్లోనూ ఈ గేమ్‌షో సూపర్‌హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ప్రేకక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ రియాలిటీ షో..

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి క్రేజీ సింగర్‌!  భారీ రెమ్యునరేషన్ తో ఎంట్రీ! ఇంతకీ ఆమె ఎవరంటే?
Bigg Boss6
Basha Shek
|

Updated on: Aug 17, 2022 | 9:37 PM

Share

Mohana Bhogaraju: బుల్లితెర రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీతో మొదలైన ఈ గేమ్‌షో అన్ని భాషల్లోనూ ఈ గేమ్‌షో సూపర్‌హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ప్రేకక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ఓటీటీలో వచ్చిన బిగ్‌బాస్ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. కేవలం హాట్‌స్టార్‌లోనే దీనిని ప్రసారం చేయడంతో చాలామంది ఈ రియాలిటీ షోను మిస్‌ అయ్యారన్న భావన కలిగింది. అయితే ఈ లోటును పూడ్చుతూ త్వరలోనే కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్‌ ఘనంగా లాంచ్‌ కానుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగపెట్టే సభ్యుల ఎంపిక కూడా దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. స్టార్‌ యాంకర్‌ ఉదయభాను, కమెడియన్‌ చలాకీ చంటి, దీపికా పిల్లి, శ్రీహాన్‌, నేహా చౌదరి, ఆర్జే సూర్య, అమర్‌దీప్‌, ఆది రెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్‌, నువ్వు నాకు నచ్చావ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సుదీప తదితరులు బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారట. అయితే దీనిపై అటు బిగ్‌బాస్‌ యాజమాన్యం కానీ, అటు కంటెస్టెంట్లు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇకపోతే సింగర్స్‌ కేటగిరీలో రేవంత్‌ సెలక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ఫీమేల్‌ సింగర్‌ను కూడా రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. బుల్లెట్టు బండితో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన సింగర్‌ మోహన భోగరాజు ఈ రియాలిటీ షోలోకి పంపించాలని బిగ్‌బాస్‌ యాజమాన్యం భావిస్తోందట. ఆమెను నేరుగా షో ప్రారంభంలోనో లేదా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారానైనా లోనికి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్లు బాగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే బిగ్‌బాస్‌ షో ప్రారంభమయ్యేంతవరకు వేడి చూడాల్సిందే. సెప్టెంబర్‌ 4 నుంచి ఈ గేమ్‌షో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..