Walking: భోజనం చేసిన తర్వాత నడక.. ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Health Tips: నడక గొప్ప వ్యాయామం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా రకాల వ్యాయామాల మాదిరిగానే, గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు నడకను సరిగ్గా ఉపయోగించుకోవాలి.

Walking: భోజనం చేసిన తర్వాత నడక.. ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Walking After A Meal
Follow us

|

Updated on: Aug 17, 2022 | 6:52 PM

Health Tips: నడక గొప్ప వ్యాయామం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా రకాల వ్యాయామాల మాదిరిగానే, గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు నడకను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, చాలా మంది ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఫిట్‌గా అలాగే ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మరికొందరు ఈవెనింగ్ వాక్‌కు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇది కూడా మంచి అలవాటే. ఇక భోజనం తర్వాత నడవడం కూడా మంచి విషయమే. ఇలా నడవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలా కాకుండా ఇంట్లో కానీ, బయట కానీ కొన్ని నిమిషాల పాటు నడిస్తే పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి.

ఆరోగ్య ప్రయోజనాలివే..

  • భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే జీవక్రియ రేటు మెరుగుపడేందుకు సహాయపడుతుంది. ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగా అందుతాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఈ వ్యాయామం గుండెకు కూడా చాలా మంచిది. భోజనం తర్వాత నడిస్తే శరీరంలోని కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి.
  • బరువు తగ్గాలనుకున్నప్పుడు, శరీరంలో అదనపు కేలరీలను కరిగించడంపై దృష్టి సారించాలి. భోజనం తర్వాత నడవడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. తద్వారా సులభంగా బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.
  • గుండె ఆరోగ్యం, బరువు తగ్గడంతో పాటు, భోజనం తర్వాత నడవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.

గమనిక: ఈ కథనంలోని అందించిన చిట్కాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా చిట్కాలను, పద్ధతులను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మాల్దీవుల్లో యూపీఐ సేవలు.. ప్రకటించిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు.. ప్రకటించిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.. జీవితకాల డిస్‌ప్లే వారంటీ..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.. జీవితకాల డిస్‌ప్లే వారంటీ..
ఇకపై ఎన్​ఐసీకి ధరణి నిర్వహణ బాధ్యతలు..!
ఇకపై ఎన్​ఐసీకి ధరణి నిర్వహణ బాధ్యతలు..!
రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. కృష్ణ భజనలతో ఘన స్వాగతం
రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. కృష్ణ భజనలతో ఘన స్వాగతం
రాత్రిపూట మీకు ఒక్కసారిగా చెమట పడుతోందా..? అలెర్ట్ అవ్వండి..
రాత్రిపూట మీకు ఒక్కసారిగా చెమట పడుతోందా..? అలెర్ట్ అవ్వండి..
నిరుద్యోగులకు సదావకాశం.. APSRTCలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
నిరుద్యోగులకు సదావకాశం.. APSRTCలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
వారంలో ఒక్కసారి ఎక్సర్ సైజ్ చేసినా ఊహించని లాభాలు..
వారంలో ఒక్కసారి ఎక్సర్ సైజ్ చేసినా ఊహించని లాభాలు..
శరవేగంగా రామ్‌చరణ్‌ మైనపు విగ్రహా తయారీ.. ఏర్పాటు ఎప్పుడంటే..
శరవేగంగా రామ్‌చరణ్‌ మైనపు విగ్రహా తయారీ.. ఏర్పాటు ఎప్పుడంటే..
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తుంటే ఈ వస్తువులు కనిపిస్తే శుభప్రదం
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తుంటే ఈ వస్తువులు కనిపిస్తే శుభప్రదం
ఎడమ చేతి వాటం ఉన్నవారికి అలెర్ట్.. పిడుగులాంటి వార్త
ఎడమ చేతి వాటం ఉన్నవారికి అలెర్ట్.. పిడుగులాంటి వార్త