Viral Video: ఇతనిది ఏం గుండెరా సామీ.. ఇంట్లో దూరిన కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి

King Cobra: చిన్నాపాటి పాములను చూస్తేనే మనం జడిసిపోతుంటాం. పొరపాటున అవి కనిపిస్తే ఆ దరిదాపుల్లో కూడా ఉంటాం. వెంటనే అక్కడినుంచి పారిపోతాం. అయితే ఇటీవల కొందరు పాములను పట్టుకుని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

Viral Video: ఇతనిది ఏం గుండెరా సామీ.. ఇంట్లో దూరిన కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి
King Cobra
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2022 | 4:31 PM

King Cobra: చిన్నపాటి పాములను చూస్తేనే మనం జడిసిపోతుంటాం. పొరపాటున అవి కనిపిస్తే ఆ దరిదాపుల్లో కూడా ఉండం. వెంటనే అక్కడినుంచి పారిపోతాం. అయితే ఇటీవల కొందరు పాములను పట్టుకుని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ వాటికి బాగా ఆదరణ వస్తోంది. నెటిజన్లు పాము వీడియోలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని మాత్రం భయాందోళనకు గురిచేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. 12 అడుగుల డేంజరస్‌ కింగ్‌కోబ్రాను ఓ స్నేక్‌ క్యాచర్‌ అలవోకగా పట్టేశాడు. దీంతో అతని ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన మురళీవాలే హౌస్లా పాములను పడుతుంటాడు. 2000 నుంచి అతను ఈ పని చేస్తున్నాడు. కేవలం పాములనే కాదు మూగ జీవుల ప్రాణాలను రక్షించడానికి ఎప్పుడూ ముందుంటాడీ యానిమల్‌ లవర్‌. ఈ క్రమంలోనే ఇళ్లలోకి దూరిన ఎన్నో పెద్ద పెద్ద పాములను పట్టుకుని అడవిలో వదిలేస్తుంటాడు. ఇటీవల మురళీవాలే హౌస్లా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అలా తాజాగా ఓ పాత ఇంట్లో దూరిన 12 అడుగుల కింగ్ కోబ్రాను మురళీ కష్టపడి పట్టుకున్నాడు. ఈక్రమంలో పాము కాటు వేయడానికి మీదికొచ్చినా అతను బెదరలేదు. పామును నెమ్మదిగా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి ఆపై ఓ సంచిలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరకు అడవిలో వదిలేశాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లందరూ మురళీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ‘అతనిది ఏం గుండెరా సామీ, ఆడు మగాడ్రా బుజ్జీ ‘అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే