Viral video: మమ్మీని ఇమిటేట్ చేయాలనుకుంది సీన్ రివర్స్ అయ్యింది.. వైరల్ అవుతోన్న వీడియో
మాములుగా పిల్లలు తల్లి దండ్రులను చూసి అన్నీ నేచుకుంటూ ఉంటారు. చాలా వరకు తల్లిదండ్రుల లనే ప్రవర్తిస్తూ ఉంటారు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఇదే జరుగుతుంది.
Viral video: మాములుగా పిల్లలు తల్లి దండ్రులను చూసి అన్నీ నేచుకుంటూ ఉంటారు. చాలా వరకు తల్లిదండ్రుల లనే ప్రవర్తిస్తూ ఉంటారు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఇదే జరుగుతుంది. తల్లి ఎలా చేస్తే పిల్ల జంతువులు కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వవీడియో చూస్తే నవ్వాగదు.అచ్ఛం తల్లిలానే చేద్దాం అనుకోని ఓ పిల్ల ఏనుగు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఏనుగులు భారీ ఖాయం వల్ల కొన్నిసార్లు చాలా ఇబ్బందిపడుతూ ఉంటాయి. ఈ వీడియోలో కూడా అదే జరిగింది.
ఏనుగులు భారీ కాయంతో ఉంటాయి. దాంతో అవి పడరాని పట్లు పడుతూ ఉంటాయి. వేగంగా పరిగెత్తలేవు.. ఎతైన ప్రదేశాల పై నుంచి కిందికి దిగలేవు. తాజాగా ఓ ఏనుగు ఓ గట్టుపై నుంచి కిందకు దిగాల్సి వచ్చింది. దాంతో అది చాలా ఇబ్బంది పడింది. ముందుగా రెండు కళను కిందకు పెట్టి ఆ తర్వాత మోకాళ్ళ పై కూర్చొని మెల్లగా ఏదోలా కిందకు దిగేసింది. అది చూసిన పిల్ల ఏనుగు కూడా అలాగే కిందకు దిగాలని ప్రయత్నించింది కానీ అదుపుతప్పి అక్కడి నుంచి దొర్లుతూ కిందకు పడిపోయింది. ఆ తర్వాత ఏమీ తేలినట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరూ ఒక లుక్కేయండి.
Mother: This is the last time I show you how to go down..
Son: pic.twitter.com/KJFaqJXq8M
— Buitengebieden (@buitengebieden) August 17, 2022