The Ghost: రెండు నిమిషాల ప్రోమోతో అంచనాలు అమాంతం పెంచేసిన ఘోస్ట్‌.. అసలేంటీ ‘తమ హగనే’..

The Ghost: నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజశేఖర్‌తో ప్రవీణ్‌ సత్తార్‌ తెరకెక్కించిన...

The Ghost: రెండు నిమిషాల ప్రోమోతో అంచనాలు అమాంతం పెంచేసిన ఘోస్ట్‌.. అసలేంటీ ‘తమ హగనే’..
The Ghost Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 11:53 AM

The Ghost: నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజశేఖర్‌తో ప్రవీణ్‌ సత్తార్‌ తెరకెక్కించిన ‘గరుడ వేగ’ సంచలన విజయం నమోదుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఘోస్ట్‌ కూడా అదే కాన్సెప్ట్‌తో రానుండడం అంచనాలు భారీగా పెరిగాయి. వైల్డ్‌ డాగ్‌ చిత్రంలో ఏజెంట్‌ పాత్రలో మెస్మరైజ్‌ చేసిన నాగ్‌ మరోసారి అదే పాత్రలో ఆకట్టుకోనున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను చిత్ర యూనిట్‌ దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజాగా ‘తమ హగనే’ ప్రోమో పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. తమ హగనే ప్రోమోను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ప్రకటించగానే అసలు ఈ పదం ఏంటి.? దీని అర్థం ఏంటని అందరిలోనూ సందేహం నెలకొంది. గురువారం ఈ సస్పెన్స్‌కు తెర తీస్తూ చిత్ర యూనిట్‌ తమ హగనే అర్థంతో పాటు, ప్రోమోను విడుదల చేసింది.

2 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. అండర్‌ వరల్డ్‌ మొత్తం దాడి చేయడానికి తనపైకి రాగా నాగార్జున ఎలా అటాక్‌ చేశాడో చూపించారు. ఈ క్రమంలోనే తమ హగనే అంటే ‘విలువైన ఉక్కు’ అని చెబుతూ.. నాగ్‌ ఆ ఉక్కుతో ఒక కత్తిని తయారు చేసుకొని అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌పై ఎలా అటాక్‌ చేశాడన్న దానిని ప్రోమోలో చూపించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సరికొత్త లుక్‌లో కనిపించిన నాగ్‌ మెస్మరైజ్‌ చేస్తున్నాడు. ఇక ఆగస్టు 25న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చిన్న ప్రోమోతోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారితే. ఇక ట్రైలర్‌తో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..