Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu: ‘చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా’.. వెంకయ్య నాయుడు మనసును దోచిన ఆ సినిమా ఏంటంటే..

Venkaiah Naidu: చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయాన్ని అందుకుంది సీతారామం చిత్రం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు...

Venkaiah Naidu: 'చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా'.. వెంకయ్య నాయుడు మనసును దోచిన ఆ సినిమా ఏంటంటే..
Venkaiah Naidu
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 11:23 AM

Venkaiah Naidu: చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయాన్ని అందుకుంది సీతారామం చిత్రం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌ అద్భుత నటన, హను మార్క్‌ దర్శకత్వం.. సూపర్‌ మ్యూజిక్‌ ఇలా సినిమాలోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆగస్టు 5న విడుదలైన సినిమా కేవలం 13 రోజుల్లోనే ఏకంగా రూ. 50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడతూ దూసుకుపోతోంది.

ఇక ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి, ప్రముఖ నాయకుడు వెంకయ్యనాయుడు సీతారామం చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. పెద్దగా సినిమాలు చూడని వెంకయ్య తొలిసారి ఒక చిత్రంపై ఇలా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

సినిమా పోస్టర్‌లను ట్వీట్ చేస్తూ.. ”సీతారామం’ చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది’ అంటూ రాసుకొచ్చారు.

ఇక మరో ట్వీట్‌లో.. ‘చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని “సీతారామం” అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొ్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..