Karthikeya 2: అమీర్, అక్షయ్ లకు షాక్ ఇచ్చిన నిఖిల్.. బీ టౌన్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న కార్తికేయ 2

నార్త్ ఇండియాలో సత్తా చాటుతున్న సినిమాల సరసన నిఖిల్ నటించిన కార్తీకేయ 2 సినిమా నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాలను బీట్ చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. భారీ కలెక్షన్లను రాబడుతు సంచలనం సృష్టిస్తోంది..

Karthikeya 2: అమీర్, అక్షయ్ లకు షాక్ ఇచ్చిన నిఖిల్.. బీ టౌన్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న కార్తికేయ 2
Karthikeya 2 In Bollywood
Follow us
Surya Kala

|

Updated on: Aug 18, 2022 | 12:09 PM

Karthikeya 2 Box Office Collection: సరికొత్త కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం ఉంటే.. భాషతో పనిలేదని అనేక సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు పట్టంగడుతున్నారు. కరోనా వైరస్ తర్వాత బాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది. బీ టౌన్ లో స్టార్ హీరోల సినిమాలు కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. అక్షయ్ కుమార్, షారుఖ్, సల్మాన్ ఖాన్ సహా భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అయితే అదే సమయంలో పుష్ప, కేజీఎఫ్ 2 సినిమాలు బీ టౌన్ లో సత్తా చాటాయి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కురిపించాయి. ఇప్పడు మరో సినిమా దక్షిణాది సినిమా అదీ ఒక యంగ్ హీరో సినిమా బీ టౌన్ భారీ సినిమాలను బీట్ చేస్తూ.. సత్తా చాటుతోంది. వివరాల్లోకి వెళ్తే..

పుష్ప, కేజీఎఫ్ 2 తర్వాత  కార్తికేయ 2 హిందీలో రిలీజ్ అయింది. ఆధ్యాత్మికం.. సస్పెన్స్ కలిసి తెరకెక్కిన కార్తికేయ సినిమాను తెలుగువారితో పాటు.. నార్త్ ఇండియన్స్ కూడా ఆదరిస్తున్నారు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ తాజా సినిమా లాల్ సింగ్ చద్దా.. అక్షయ్ కుమార రక్షా బంధన్ సినిమాల కలెక్షన్ల బు దాటి.. కార్తికేయ 2 హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. మంగళవారం లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ కంటే మెరుగైన స్టేజ్ లో వసూళ్లను రాబట్టింది.

కార్తికేయ 2 హిందీ బాక్సాఫీస్ కలెక్షన్ నిఖిల్ సిద్ధార్థ నటించిన తెలుగు సినిమా కార్తికేయ 2ను నిర్మాతలు హిందీతో సహా పలు భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. అయితే హిందీలో సినిమా చాలా తక్కువ స్క్రీన్లలో విడుదలైంది. అయితే మెల్లగా కార్తికేయ సినిమా బీ టౌన్ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. దీంతో సినిమా ప్రదర్సించే స్క్రీన్లను పెంచారు. హిందీలో పెద్దగా ప్రమోష న్ చేయకపోయినా.. కార్తీకేయ సీక్వెల్ వీకెండ్‌లో అద్భుతంగా దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

కార్తికేయ 2 అన్ని భాషలు కలిపి మంగళవారం రూ. 3.85 కోట్లను రాబట్టింది. నివేదిక ప్రకారం, అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సుమారు రూ. 2 కోట్లను వసూలు చేశాయి. వర్కింగ్ డే మంగళవారంలో కూడా.. నిఖిల్ సిద్ధార్థ చిత్రం ఇద్దరు బాలీవుడ్ పెద్దలను ఓడించి మంచి కలెక్షన్లను రాబట్టాడు.

లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ షోలను రీప్లేస్ చేసేదిశగా కార్తికేయ 2: కొన్ని మీడియా నివేదికల ప్రకారం, థియేటర్ యజమానులు లాల్ సింగ్ చద్దా, రక్షా బంధ మూవీని తీసి.. ఆ ప్లేస్ లో కార్తికేయ 2 ప్రదర్శించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ నటించిన పుష్ప హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి.. అయితే పాజిటివ్ మౌత్ టాక్ తో మంచి గ్రోత్ కనబరిచి రూ.కోటికి పైగా కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ తండ్రి .. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల కార్తికేయ 2 సక్సెస్ మీట్‌లో పుష్ప లాగానే నిఖిల్ సినిమా కూడా హిందీలో బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు.

కార్తికేయ 2 టీమ్‌కి ప్రభాస్ అభినందనలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కార్తికేయ 2 చిత్రం భారీ విజయం సాధించినందున చిత్ర బృందాన్ని అభినందించారు. దీంతో ప్రభాస్‌కు నిఖిల్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు చెప్పాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?