Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: లైగర్ కోసం ముందు అనుకున్నది అనన్యను కాదట.. పూరి మనసులో ఉన్న ఆ హీరోయిన్ ఎవరంటే..

అయితే లైగర్ చిత్రం కోసం ముందుగా అనన్యను తీసుకోవాలనుకోలేదట. ఈ సినిమా అనుకున్న సమయంలో పూరి మనసులో మరో బాలీవుడ్ బ్యూటీ ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు డైరెక్టర్.

Liger: లైగర్ కోసం ముందు అనుకున్నది అనన్యను కాదట.. పూరి మనసులో ఉన్న ఆ హీరోయిన్ ఎవరంటే..
Puri Jagannadh
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 18, 2022 | 10:51 AM

ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ (Liger) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కోసం సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఆగస్ట్ 25న గ్రాండ్‏గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. లైగర్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనన్య. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఫ్యాన్‏డమ్ టూర్స్ నిర్వహిస్తున్న సంగతి తెలసిందే. ఈ వేడుకలకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. అందులో ఎక్కువగా విజయ్ కోసం వస్తుంటే.. మరికొందరు మాత్రం అనన్యను చూసేందుకు వస్తున్నారు. సినిమా విడుదలకు ముందే కుర్రకారు ఫెవరేట్ క్రష్ అయ్యింది అనన్య. అయితే లైగర్ చిత్రం కోసం ముందుగా అనన్యను తీసుకోవాలనుకోలేదట. ఈ సినిమా అనుకున్న సమయంలో పూరి మనసులో మరో బాలీవుడ్ బ్యూటీ ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు డైరెక్టర్.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఆంగ్లపత్రికతో ముచ్చటించిన పూరి లైగర్ సినిమా కోసం ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నట్లు చెప్పారు. “ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నప్పుడు ఇందులోకి ఓ యువనటి కావాలనుకున్నాను. నేను శ్రీదేవి గారికి వీరాభిమానిని. అందుకే నేను ఆమె కూతురు జాన్వీని ఈ సినిమాతో దక్షిణాదికి పరిచయం చేయాలనుకున్నాను. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు చెప్పడంతో ఆయన వెంటనే ఓకే చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అలాగే హీరోయిన్ గురించి చెప్పడంతో కరణ్ అనన్య పాండే పేరును సూచించారు. అలా ఆమెను ఎంపిక చేశాము. అనన్య మంచి నటి. ప్రతి సన్నివేశంలోనూ అద్భుతమైన హావాభావాలను పలికించింది.

ఇవి కూడా చదవండి

ఈ కథను నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం రాశాను. ఈ స్క్రిప్ట్ విజయ్ కు చెప్పినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి అతడికి నేను రెండు కథలను చెప్పగా.. తనకు లైగర్ నచ్చింది. ఈ స్టోరీకి తగినట్టుగా తన శరీరాన్ని మార్చుకుంటానని విజయ్ చెప్పారు” అని అన్నారు పూరి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.