Liger Movie: ‘జేబులో ఒక్క రూపాయి లేదు.. ఓటీటీ ఆఫర్ వదిలేసుకున్నాం’.. లైగర్ టీం ఎమోషనల్..

ఇక లైగర్ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండను నిర్మాత ఛార్మి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Liger Movie: 'జేబులో ఒక్క రూపాయి లేదు.. ఓటీటీ ఆఫర్ వదిలేసుకున్నాం'.. లైగర్ టీం ఎమోషనల్..
Liger
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 18, 2022 | 7:51 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా నటిస్తోన్న చిత్రం లైగర్ (Liger). ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీతో అనన్య దక్షిణాది చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీని మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా.. హీరోయిన్ ఛార్మి, దర్శకుడు పూరి, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందులో విజయ్ మొదటిసారి నత్తి ఉన్న అబ్బాయిగా కనిపించనుండడంతో సినిమా కోసం ప్రేక్షకుల ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక లైగర్ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండను నిర్మాత ఛార్మి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

ఆ ప్రోమోలో అభిమానుల నుంచి వచ్చిన అనేక ప్రశ్నలను డైరెక్టర్, హీరోను అడిగారు ఛార్మి. ఆమె అడిగిన ప్రశ్నలకు ఎంతో సరదాగా ఆన్సర్స్ ఇచ్చారు విజయ్. విజయ్ సోషల్ మీడియా ఖాతాలపై కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తన జీవితంలోనే ఎదురైన చేదు సంఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు ఛార్మి. లాక్ డౌన్ సమయంలో జేబులో ఒక్క రూపాయి లేనప్పుడు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అంత పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి అంటూ ఛార్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం లైగర్ టీం స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఛార్మి ప్రోమో వైరల్ అవుతుంది.

ప్రోమో..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి