Amala Paul: ‘ పోస్ట్‏మార్టం చేయడం నేరుగా చూశాను.. జీవితాన్నే మార్చేసింది’.. అమలాపాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఒకే సినిమాలో నిర్మాతగా..నటిగా ఉండడం తనకు కొత్త అనుభవమని.. డైరెక్టర్ స్క్రిప్ట్ గురించి చెప్పినప్పుడు భద్ర పాత్రను అస్సలు ఉహించుకోలేకపోయాను. వైద్యులు ఎలా ఉంటారనేది తెలుసుకున్నాను.

Amala Paul: ' పోస్ట్‏మార్టం చేయడం నేరుగా చూశాను.. జీవితాన్నే మార్చేసింది'.. అమలాపాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Amala Paul
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 18, 2022 | 7:27 AM

వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్ (Amala Paul). ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కడవర్. డైరెక్టర్ అనూప్ పనికర్ రూపొందించిన ఇన్వెస్టిగేటర్ థ్రిల్లర్ కడవర్ ఆగస్ట్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో డాక్టర్ భద్ర పోలీస్ సర్జన్ పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం చిత్రయూనిట్ పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేశామని.. తాను మర్చురీలోకి వెళ్లి పోస్ట్ మార్టం చేయడం చూసినట్లు చెప్పుకొచ్చింది అమలాపాల్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అమలాపాల్ మాట్లాడుతూ.. ” కడవర్ చిత్రం కోసం చాలా ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ అనూప్ పనికర్, రచయిత అభిలాష్ పిళ్లైతో కలిసి చాలా మందితో ఇంట్రాక్ట్ అయ్యాము. ఆసుపత్రులు, నిపుణులతో మాట్లాడి వారి పని గురించి తెలుసుకున్నాము. ఈ క్రమంలోనే నేను మర్చురీకి కూడా వెళ్లాను. అక్కడ నేరుగా పోస్ట్ మార్టం చేయడం చూశాను. నిజంగా చెప్పాలంటే నా జీవితాన్ని మార్చే అనుభవం ఇది. హృదయాన్ని కదిలించింది ఆ దృశ్యం. మనమందరం చిన్న చిన్న విషయాలపై ఎలా దృష్టి పెడుతున్నామో నాకు అర్థమైంది. ప్రాణంలేని శరీరాన్ని చూసినప్పుడు నిజంగానే మేలుకోవతో ఉందా అనే సందేహం కలిగింది. నా జుట్టు కత్తిరించి పూర్తిగా పాత్రలో ఒదిగిపోవాలనుకున్నాను. అహంకారమనేది మరణంతో సమానం. మార్చురీలో ప్రాణం లేని శరీరాన్ని చూసిన తర్వాత జీవితంలో అనేక విషయాలను భిన్నంగా చూడాలనుకున్నాను”

అలాగే ఒకే సినిమాలో నిర్మాతగా..నటిగా ఉండడం తనకు కొత్త అనుభవమని.. డైరెక్టర్ స్క్రిప్ట్ గురించి చెప్పినప్పుడు భద్ర పాత్రను అస్సలు ఉహించుకోలేకపోయాను. వైద్యులు ఎలా ఉంటారనేది తెలుసుకున్నాను. అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే