Liger Pre Release Event: రౌడీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడంటే..

ఆగస్ట్ 25న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు.

Liger Pre Release Event: రౌడీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Liger Movie Review
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 18, 2022 | 4:20 PM

మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్(Liger). డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ పెంచేశాయి. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఆగస్ట్ 25న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే నార్త్, సౌత్ ప్రధాన నగరాల్లో లైగర్ ఫ్యాన్‏డమ్ ఈవెంట్స్ నిర్వహించి అభిమానులకు దగ్గరయ్యారు లైగర్ చిత్రయూనిట్. ఇక తాజాగా లైగర్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది టీం.

ఆగస్ట్ 20న సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా మోతడక ప్రాంతంలోని చలపతి ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‏లో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను నిర్వహించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ పవర్ ఫుల్ లుక్ పోస్టర్ వదిలింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి