AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Milk: ఆవుపాలు, మేక పాలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?

Goat Milk Benefits: శరీరానికి పూర్తి పోషణను అందించే అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో మేక పాలు కూడా ఒకటి . మేక పాలలో అధిక పోషకాలు ఉన్నందున ఆవు పాలకు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు.

Goat Milk: ఆవుపాలు, మేక పాలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?
Goat Milk Benefits
Basha Shek
|

Updated on: Aug 18, 2022 | 9:19 PM

Share

Goat Milk Benefits: శరీరానికి పూర్తి పోషణను అందించే అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో మేక పాలు కూడా ఒకటి . మేక పాలలో అధిక పోషకాలు ఉన్నందున ఆవు పాలకు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. అంతెందుకు పుట్టిన పిల్లలకు చాలామంది మేక పాలే పట్టిస్తారు. ఇందులోని ఇనుము, తదితర పోషకాలు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తాయి. అలాగే ఎముకల నిర్మాణానికి ఉపయోగపడతాయి. పైగా మేక పాలలో తక్కువ ఎంజైమ్‌లు ఉంటాయి కాబట్టి తేలికగా జీర్ణమవుతాయి. ప్రోటీన్, లాక్టోస్ అధికంగా ఉంటాయి కాబట్టి మేక పాలు శరీరంలో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తోంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా మేకపాలు బాగా సహాయపడుతాయి.

మేకపాలతో లాభాలేంటంటే?

ఇవి కూడా చదవండి
  • మేక పాలలో A, D, B12 విటమిన్లతో సహా ఇనుము, జింక్, కాపర్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
  • మేక పాలలో సంతృప్త కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి.
  • అధిక ప్రోటీన్లు ఉండటం వల్ల ఆవు పాలకు మేక పాలు మంచి ప్రత్యామ్నాయం
  • డెంగ్యూ వ్యాధిని నివారించే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో మేక పాలు బాగా సహాయపడతాయి. కాబట్టి డెంగ్యూ వ్యాధిగ్రస్తులు మేక పాలు తాగితే త్వరగా కోలుకుంటారు.
  • మేక పాలలో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఉండవు.
  • ఈ పాలలో లాక్టోట్రాన్స్‌ఫెర్రిన్ అనే ఐరన్ బైండింగ్ ప్రొటీన్ కూడా ఉంటుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగులలోని రోగనిరోధక కణాలలో ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఏర్పడకుండా నిరోధించడం ద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది.
  • మేక పాలతో తయారు చేసిన సబ్బులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే అవి శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి.
  • మేక పాలలో కేసైన్ ఉంటుంది. ఇది పోషక విలువలను నిర్వహించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  • మేకపాలలోని పోషకాలు కండరాలను, ఎముకలను బలంగా మారుస్తాయి.
  • ఇందులో కొవ్వు తక్కువగా ఉంటాయి. క్యాలరీలు కూడా తక్కువే. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం
  • మేక పాలు చాలా ఘాటైన వాసన కలిగి ఉండడం వల్ల కొందరు తాగడానికి ఇష్టపడరు. అయితే ఇందులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..