Kidney Health: కిడ్నీలను కలకాలం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచాలంటే ఈ డ్రింక్స్ తాగాల్సిందే.. అవేంటంటే..?
రోజు మొత్తంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే కిడ్నీ పని చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. మంచి ఆహారం తీసుకునే వారి ఆరోగ్యం బాగుంటుంది.. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
Kidney detox drinks: మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలోని విషపదార్థాలను తొలగించడానికి నిరంతరం పనిచేస్తాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మన దినచర్యను మెరుగుపరచుకోవాలి. రోజు మొత్తంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే కిడ్నీ పని చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. మంచి ఆహారం తీసుకునే వారి ఆరోగ్యం బాగుంటుంది.. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మూత్రపిండాల వైఫల్యం, రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు డిటాక్స్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. మూత్రపిండాలు శుభ్రంగా ఉంచడంలో సహాయపడే డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నీరు, ఏలకులు: కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఏలకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొందరికే తెలుసు. కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. మరోవైపు, ఏలకులు తీసుకోవడం వల్ల మీ శరీరంలోని బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అందుకే నోటి నుంచి వచ్చే వాసన ఆగిపోతుంది. కానీ కొబ్బరి, యాలకుల కలయిక మూత్రపిండాలకు మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఏలకులు కలిపి తాగడం వల్ల కిడ్నీలు డిటాక్సిఫై అవుతాయి. కొబ్బరి నీళ్లను తాగే ప్రతిసారీ దానికి కొంచెం యాలకుల పొడిని కలపి తీసుకుంటే చాలామంచిది.
అల్లం – కొత్తిమీర : కొత్తిమీర ఆహారం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లం కూడా పలు సమస్యలను నుంచి కాపాడుతుంది. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం, కొత్తిమీర మంచిదిగా పరిగణిస్తారు. దీనికోసం కొంచెం అల్లం, కొత్తిమీరను నీళ్లలో వేసి మరిగించాలి. ఈ కషాయం తీసుకోవడం ద్వారా కిడ్నీలను శుభ్రం చేసుకోవచ్చు.
నిమ్మ రసం- వేడి నీరు: నిమ్మకాయ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఉదరానికి సంబంధించిన సమస్య ఏదైనా నిమ్మకాయతో తగ్గించుకోవచ్చు. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించేందుకు, కిడ్నీ డిటాక్స్ కోసం నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..