Health Tips: శరీరంలో ఆ లోపం ఉందా..? అయితే, ప్రమాదంలో పడినట్లే.. తప్పనిసరిగా తెలుసుకోండి..

శరీరంలోని ఎముకలు దృఢంగా మార్చడానికి, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం సహాయపడుతుంది. అంతే కాదు.. క్యాల్షియం శరీరంలోని రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది.

Health Tips: శరీరంలో ఆ లోపం ఉందా..? అయితే, ప్రమాదంలో పడినట్లే.. తప్పనిసరిగా తెలుసుకోండి..
Calcium Deficiency
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 18, 2022 | 6:20 PM

Calcium deficiency: శరీరంలో విటమిన్లు, పోషకాలు తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో కాల్షియం కూడా ఒకటి. శరీరంలోని ఎముకలు దృఢంగా మార్చడానికి, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం సహాయపడుతుంది. అంతే కాదు.. క్యాల్షియం శరీరంలోని రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది. అలాగే శరీర అభివృద్ధిలో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. అయితే.. సాధారణంగా మనం పుష్కలంగా ఆహారం తీసుకుంటాము.. కానీ శరీరానికి తగినంత కాల్షియం అందదు. దీని వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు చుట్టుముడుతాయి. అటువంటి పరిస్థితిలో శరీరానికి కాల్షియం ఎందుకు ముఖ్యమో.. దాని లోపం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కాల్షియం లోపం ఈ వ్యాధులకు దారి తీస్తుంది..

ఎముకలు బలహీనమవుతాయి: ఆస్టియోపోరోసిస్ వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి. ఈ సమస్య వల్ల ఎముకలు విరగడం, బెణుకులు, చిట్లడం లాంటి సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కండరాల నొప్పి: శరీరంలో తగినంత కాల్షియం లేకపోవడం వల్ల కండరాల నొప్పి సమస్య మొదలవుతుంది. ఈ నొప్పి ఎముకలు, కీళ్లలో కూడా రావచ్చు. కొన్నిసార్లు కండరాల నొప్పులు పెరిగి రోజువారీ పని కూడా కష్టమవుతుంది.

గుండె జబ్బులు: శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కొన్నిసార్లు కాల్షియం లోపం గుండెపోటు, స్ట్రోక్‌కు కూడా దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

రక్తపోటు: కాల్షియం లోపం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. శరీరంలో కాల్షియం లేకపోవడం గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. మీ శరీరంలో కాల్షియం పరిమాణం సరిగ్గా ఉంటే.. బ్లడ్ ప్రెసర్ నియంత్రణలో ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..