Lemon Side Effects: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా..? అయితే, ఈ అనర్థాలు తప్పవంట..

నిమ్మరసం ఎక్కువగా తాగడం మన శరీరానికి అస్సలు మంచిది కాదని పేర్కొంటున్నారు. నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Lemon Side Effects: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా..? అయితే, ఈ అనర్థాలు తప్పవంట..
Lemon Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2022 | 7:32 PM

Lemon Water Side Effects: నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు నిమ్మకాయ జీర్ణక్రియ సులభతరం చేస్తుంది. దీంతో కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. అయినప్పటికీ, ఏదైనా అధికంగా ఉపయోగించడం హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. నిమ్మరసం ఎక్కువగా తాగడం మన శరీరానికి అస్సలు మంచిది కాదని పేర్కొంటున్నారు. నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు..

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఈ పోషకాల స్థాయి పెరిగితే.. అది చాలా ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. కావున దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. నిమ్మకాయ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

ఇవి కూడా చదవండి

కడుపునొప్పి : విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల స్రావం పెరుగుతుంది. ఇది ఎసిడిటీ ప్రమాదాన్ని పెంచుతుంది. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌తో బాధపడేవారు తక్కువ నిమ్మరసం తాగాలి.

నోటిలో బొబ్బలు: నిమ్మకాయ నోటి దుర్వాసన, దంతాలను శుభ్రపరుస్తుంది, అయితే మీరు నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగితే అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలాలలో వాపును కలిగిస్తుంది. దీని కారణంగా పొక్కులు, బొబ్బలతోపాటు నోటిలో అసౌకర్యంగా ఉంటుంది.

బలహీనమైన దంతాలు : నిమ్మరసం తాగినప్పుడల్లా జాగ్రత్తగా ఉండాలి. దీనిలోని ఆమ్లాలు దంత సమస్యలను పెంచుతాయి. అంతేకాకుండా దంతాలు బలహీనంగా మారతాయి.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌