Viral Video: కిక్కెక్కింది.. అడుగులు తడబడ్డాయి.. కట్ చేస్తే సీను సితారైంది.. మందు బాబులు జర జాగ్రత్త..!
వైరల్ అవుతున్న వీడియోలో.. స్కూటీపై ఇద్దరు వస్తారు. వీరిద్దరూ కూడా తాగి ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా సంభాషించుకుంటారు. అనంతరం ఒకతను స్కూటీపై వెళ్లగా.. మరొక వ్యక్తి రోడ్డుపై వర్షం నీటిలో అటు ఇటు తూలుతూ
Drunk old man video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ మందు బాబుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫుల్లుగా మద్యం తాగొచ్చిన ఓ వ్యక్తి.. అడుగులో అగుగేసుకుంటూ వెళ్లి అక్కడున్న డ్రైనేజీలో పడతాడు. అదృష్టం ఎంటంటే.. అతను పడటాన్ని చూసిన వారంతా.. పరుగులు తీస్తూ వెళ్లి కాపాడారు. కొంచెం అయితే.. అతని ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది. సాధారణంగా.. వర్షాకాలంలో డ్రెయిన్లు శుభ్రం చేయక పోవడం వల్ల రోడ్లు జలమయంగా మారుతాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అదే సమయంలో రహదారి పొడవునా గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి కనిపించింది. ఈ వీడియో చూసి మీరే షాకవుతారు. పుల్లుగా తాగొచ్చిన ఓ వృద్ధుడు.. రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోతాడు. ఆ తర్వాత డ్రైనేజీ కాల్వలో కొట్టుకుపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. స్కూటీపై ఇద్దరు వస్తారు. వీరిద్దరూ కూడా తాగి ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా సంభాషించుకుంటారు. అనంతరం ఒకతను స్కూటీపై వెళ్లగా.. మరొక వ్యక్తి రోడ్డుపై వర్షం నీటిలో అటు ఇటు తూలుతూ, నడుస్తూ కనిపిస్తాడు. అనంతరం.. అతను నేరుగా వెళ్లి డ్రైనేజీలో పడతాడు. ఈ క్షణంలో ఏం జరిగిందో చూస్తే మీరే షాక్ అవుతారు. కాలువలో పడిపోయిన వృద్ధుడిని చూసి.. సమీపంలోని కొందరు వ్యక్తులు వెంటనే కాపాడేందుకు పరుగులు తీశారు. కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వృద్ధుడిని కొంచెం దూరంలో గుర్తించి.. డ్రైనేజీ నుంచి బయటకు తీస్తారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
వృద్ధుడు కాలువలో కొట్టుకుపోతున్న వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వైరల్ వీడియోను coach_manjunath_kickboxer అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. దీన్ని వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని.. ఫుల్లుగా మద్యం తాగి రోడ్ల మీదకు రావొద్దంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..