AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బరితెగించిన దొంగలు.. నడిరోడ్డుపై మహిళ బ్యాగ్‌ను ఎత్తుకెళ్ళి.. ఆపై.. నెట్టింట వీడియో వైరల్!

బైక్‌పై వచ్చిన దుండగులు ఒక మహిళపై దాడి చేసి అమాంతం బ్యాగ్‌ లాక్కొని పారిపోయారు. దీంతో మహిళకు గాయలయ్యాయి. మెడలో బ్యాగ్‌ ఉండటంతో ఆమె కిందపడిపోయింది.

Viral: బరితెగించిన దొంగలు.. నడిరోడ్డుపై మహిళ బ్యాగ్‌ను ఎత్తుకెళ్ళి.. ఆపై.. నెట్టింట వీడియో వైరల్!
Delhi
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2022 | 3:43 PM

Share

Bikers Snatch Woman’s Bag Video: దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చిపోతున్నారు.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు.. మహిళపై దాడి చేసి మరి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నాగరికమైన గ్రేటర్ కైలాష్-1 ఎమ్‌ బ్లాక్ మార్కెట్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన అక్కడున్న CCTV కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో.. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక మహిళపై దాడి చేసి అమాంతం బ్యాగ్‌ లాక్కొని పారిపోయారు. దీంతో మహిళకు గాయలయ్యాయి. మెడలో బ్యాగ్‌ ఉండటంతో ఆమె కిందపడిపోయింది. బాధితురాలు శ్రీనగర్ నివాసి షాహిదా బజాజ్‌ (46) గా గుర్తించారు. భర్తతో సహా ఢిల్లీ వచ్చి.. ఓ హోటల్‌లో పనిచేస్తోంది. జూలై 30న భర్తతో కలిసి హోటల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు.

వీడియో ఫుటేజీలో.. రద్దీగా ఉన్న మార్కెట్లో బైక్‌పై వచ్చిన నిందితులలో ఒకరు ఆమె బ్యాగ్‌ను గట్టిగా లాగాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోవడాన్ని చూడవచ్చు. ఆమె భర్త, మరొకరు ఆమెను రక్షించారు. కాగా.. ఆమె దగ్గరున్న విలువైన వస్తువులను దోచుకునేందుకు దొంగలు ముందస్తుగా రెచ్చి నిర్వహించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. గ్రేటర్ కైలాష్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దొంగల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కగా.. గతేడాది కూడా ఢిల్లీలోని షాలిమార్‌బాగ్‌ ప్రాంతంలో ఇదే తరహాలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మహిళ మొబైల్‌ ఫోన్‌ లాక్కునే ప్రయత్నంలో.. బాధితురాలిని వంద మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు.

ఇది కూడా చదవండి:  టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..