- Telugu News Photo Gallery Political photos Congress Losing Momentum as AAP Gains in Gujarat Majority Opinion Poll Said
Gujarat Elections: బీజేపీ వైపే గుజరాతీల మొగ్గు.. మెజార్టీ ఓపినీయన్ పోల్స్ చెబుతున్నది ఇదే..
ఈఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా ఏడో సారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తుంటే.. 24 ఏళ్ల తర్వాత ఎలాగైనా పవర్ సంపాదించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Updated on: Aug 25, 2022 | 4:06 PM

ఈఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా ఏడో సారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తుంటే.. 24 ఏళ్ల తర్వాత ఎలాగైనా పవర్ సంపాదించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు గుజరాత్ లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

గుజరాత్ ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉన్నప్పటికి.. పలు సంస్థలు ఇప్పటివరకు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో బీజేపీ వైపే ప్రజలు మరోసారి మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా కాంగ్రెస్ విజయవకాశాలు దెబ్బతినడంతో పాటు.. సీట్ల సంఖ్య తగ్గుతాయని ప్రస్తుత ఓపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

గుజరాత్ శాసనసభలో మొత్తం 182 స్థానాలుండగా.. రీసెంట్ గా ఇండియా టీవీ విడుదల చేసిన ఓపినీయన్ పోల్స్ లో బీజేపీకి 108, కాంగ్రెస్ కు 55, ఆమ్ ఆద్మీ పార్టీకి 16 సీట్లు, ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలింది. గూగుల్ ట్రెండ్ లో బీజేపీవైపు 67% కాంగ్రెస్ వైపు 25% ఆమ్ ఆద్మీ వైపు 8% మంది ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు తేలింది.

వీప్రెసిడ్ సంస్థ జూన్ లో విడుదల చేసిన ఓపినీయన్ పోల్స్ ప్రకారం బీజేపీ 128, కాంగ్రెస్ 36, ఆమ్ ఆద్మీ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తేలింది. ఇతరులు ఒక స్థానంలో గెలివచ్చని వీప్రెసిడ్ సంస్థ తన ఓపినీయన్ పోల్స్ లో పేర్కొంది.

ఆగష్టు 17వ తేదీన గూగుల్ ట్రెండ్స్ ఓపినీయన్ పోల్స్ ప్రకారం బీజేపీవైపు 54%, కాంగ్రెస్ వైపు 22%, ఆమ్ ఆద్మీ పార్టీవైపు 24% శాతం ప్రజలు మొగ్గుచూపుతున్నారు.

లోక్ పోల్ సంస్థ 2021 మేలో వెల్లడించిన ఓపినీయన్ పోల్స్ ప్రకారం బీజేపీ 119, కాంగ్రెస్ 57, ఆమాద్మీ పార్టీ ఒక స్థానంలో, ఇతరులు 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం కారణంగా వరుసగా 6సార్లు పరిపాలించినప్పటికి ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపడానికి కారణంగా తెలుస్తోంది.

గుజరాత్ ను ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో బలహీనపడింది. అహ్మద్ పటేల్ వంటి సీనియర్ నాయకులు ప్రస్తుతం ఎవరూ లేకపోవడం, కేంద్ర నాయకత్వం కూడా గుజరాత్ ను పట్టించుకోవడం లేదనే భావన గుజరాత్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార వ్యతిరేకతను కాంగ్రెస్ ఉపయోగించుకోలేకపోతుంది.

గుజరాత్ లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల సూరత్ నగరపాలక సంస్థ ఎన్ని్కల్లో తొలి ప్రయత్నంలోనే రెండో స్థానంలో నిలిచిన ఉత్సాహంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. బీజేపీని ఓడించే ఏకైక పార్టీ తమదేనని ఆమ్ ఆద్మీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. తాజాగా గూగుల్ ట్రెండ్స్ ఓపినీయన్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది.



