HAL Bengaluru Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 120 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు..పదో తరగతి పాసైతే చాలు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL Bengaluru) పరిధిలోని టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. తాత్కాలిక ప్రాతిపదికన 120 అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల..
HAL Bengaluru Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL Bengaluru) పరిధిలోని టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. తాత్కాలిక ప్రాతిపదికన 120 అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల (Apprenticeship Training posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆపరేటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ విభాగాల్లో 15 నుంచి 24 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అక్టోబర్ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 18 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 9, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి..టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..