Police for Rent Controversy: హవ్వ! ఇదెక్కడి చోద్యం..పోలీసులను అద్దెకు ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం! నెట్టింట వైరలవుతోన్న రేటు చార్టు..

అద్దెకు బస్సులు, ఇల్లు దొరుకుతాయని తెలుసుగానీ, పోలీసులు- పోలీస్‌ స్టేషన్లు అద్దెకు దొరుకుతాయని మీకు తెలుసా? ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్లే! మన దేశంలో అందునా.. దక్షిణ భారతంలో ఓ ప్రముఖ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫర్‌ ఇస్తోంది..

Police for Rent Controversy: హవ్వ! ఇదెక్కడి చోద్యం..పోలీసులను అద్దెకు ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం! నెట్టింట వైరలవుతోన్న రేటు చార్టు..
Police Rent Row
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2022 | 8:48 PM

Kerala Police Rent Row: అద్దెకు బస్సులు, ఇల్లు దొరుకుతాయని తెలుసుగానీ, పోలీసులు- పోలీస్‌ స్టేషన్లు అద్దెకు దొరుకుతాయని మీకు తెలుసా? ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్లే! మన దేశంలో అందునా.. దక్షిణ భారతంలో ఓ ప్రముఖ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫర్‌ ఇస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ వార్త దావానంలా నలుదిక్కులా పాకిపోతోంది. వివరాల్లోకెళ్తే..

పోలీస్‌ రేటు చార్టు ఇదే.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం రోజురోజుకూ రాజుకుంటోంది. పాత నిబంధన ప్రకారం ఎవరైనా పోలీసు అధికారులను అద్దెకు తీసుకోవచ్చు. ఐతే అధికారి హోదాను బట్టి అందుకు వేర్వేరు ఛార్జీ చెల్లించడవల్సి ఉంటుంది. కానిస్టేబుల్‌కైతే రూ.700, ఇన్స్‌పెక్టర్‌కు రూ.2,560లు చెల్లించవల్సి ఉంటుంది. పోలీసులను మాత్రమేకాదు పోలీస్‌ స్టేషన్లను కూడా అద్దెకు తీసుకునే వెసులుబాటు ఉంది. కొంచెం ఎక్కువ మొత్తంలో రూ.33,100ల వరకు ఛార్జీ చెల్లించుకోవల్సి ఉంటుంది. సవరించిన కొత్త నిబంధనల ప్రకారం.. వ్యక్తి గత, సినిమా షూటింగ్‌ లేదా ఇతర కార్యక్రమాలకు పోలీస్‌ అధికారుల ర్యాంక్‌ ఆధారంగా ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. సీఐ అధికారికి పగటి పూట రూ.3,795, రాత్రికి రూ.4,750 చెల్లించాలి. ఎసై కేడర్ అధికారికి పగలు రూ.2,560, రాత్రికి రూ.4,360లు చెల్లించాలి. పోలీసు శునకాలకు రూ.6,950 అద్దె చెల్లించాలి. అవసరమైతే పోలీసు అధికారులు ఉపయోగించే వైర్‌లెస్ పరికరాలు కూడా అద్దెకిస్తారట. వీటి ఖరీదు రూ.2,315లు.

ఈ చట్టానికి వ్యతిరేకంగా పోలీసుల గళం.. ఈ అద్దెల వ్యవహారం తాజాగా నాటకీయంగా వెలుగులోకొచ్చింది. కూనూర్‌కు చెందిన కెకె అన్సర్‌ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లి నిమిత్తం వీఐపీ సెక్యురిటీ నెపంతో నలుగురు కానిస్టేబుళ్లను అద్దెకు మాట్లాడుకున్నాడు. ఇంత బిల్డప్‌ ఇచ్చి.. చివరికి సదరు వివాహానికి వీఐపీలు ఎవ్వరూ హాజరుకాకపోవడం కొసమెరుపు. ఈ పెళ్లితో కేరళ పోలీసుల అద్దె వ్యవహారం నలుదిక్కుల దావానంగా గుప్పుమంది. ఐతే ప్రస్తుతం అనేక మంది కేరళ పోలీసధికారులు సోషల్‌ మీడియా వేదికగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ పోలీస్ అసోసియేషన్ సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త చట్టాన్ని నిలిపివేయాలని డీజీపీ, హోంశాఖలకు పిటిషన్‌ దాఖలు చేసినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్ మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అద్దెకు పోలీసులను వాడుకోవచ్చని ఏకంగా చట్టం.. ఐతే కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 62(2) ప్రకారం.. ఉచితంగా లేదా అద్దె చెల్లించి పోలీసులను ఉపయోగించుకునే హక్కు ప్రైవేట్ వ్యక్తికి లేదనే నిబంధన ఉంది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు భద్రత అవసరమైనప్పుడు రాష్ట్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని డబ్బు చెల్లించి వినియోగించుకోవచ్చు. ప్రైవేటు వ్యక్తులకు కూడా ఈ నిబంధన వర్తించేలా చట్టం చేయడంతో కేరళ పోలీసులంతా నిరసనలు తెల్పుతున్నారు. తాజా ఘటనపై పలు పోలీసు అధికారుల సంఘాలు ముఖ్యమంత్రికి, కేరళ పోలీసు చీఫ్‌కి ఫిర్యాదు చేశాయి.