SAIL Rourkela Recruitment 2022: రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 200 ట్రైనీ పోస్టులు.. మరో 4 రోజుల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు..
భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) రూర్కెలాలోని సెయిల్-ఇస్పాట్ జనరల్ ఆసుపత్రి (SAIL Roorkela)లో.. మొత్తం 200 ట్రైనీ (నర్సింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
SAIL Rourkela Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) రూర్కెలాలోని సెయిల్-ఇస్పాట్ జనరల్ ఆసుపత్రి (SAIL Roorkela)లో.. మొత్తం 200 ట్రైనీ (నర్సింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు బోర్డు నుంచి పదో తరగతి, బీఎస్సీ నర్సింగ్, జీఎన్బీ డిప్లొమా, పీజీడీసీఏ, బీఎమ్ఎల్టీ, ఎంబీఏ/బీబీఏ/పీజీ డిప్లొమా/డిగ్రీ/బీపీటీ/డీ ఫార్మసీ/బీఫార్మీసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.9000ల నుంచ రూ.17000ల స్టైపెండ్ చెల్లిస్తారు.
సీట్ల వివరాలు:
- మెడికల్ అటెండెంట్ ట్రైనీ: 100
- క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనీ: 20
- అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనీ: 40
- డేటా ఎంట్రీ ఆపరేటర్/మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనీ: 06
- మెడికల్ ల్యాబ్. టెక్నీషియన్ ట్రైనీ: 10
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనీ: 10
- ఓటీ/అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనీ: 5
- అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ ట్రైనీ: 3
- రేడియోగ్రాఫర్ ట్రైనీ: 3
- ఫార్మసిస్ట్ ట్రైనీ: 3
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.