IRCON Recruitment 2022: నెలకు రూ.90 వేల జీతంతో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON) ముంబయి- అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుల్లో పనిచేయడానికి.. ఒప్పంద ప్రాతిపదికన..

IRCON Recruitment 2022: నెలకు రూ.90 వేల జీతంతో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Ircon
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2022 | 2:53 PM

IRCON New Delhi Chief SHE Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON) ముంబయి- అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుల్లో పనిచేయడానికి.. ఒప్పంద ప్రాతిపదికన 11 చీఫ్ ఎస్‌హెచ్‌ఈ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎస్‌హెచ్‌ఈ ఆఫీసర్ తదితర పోస్టుల (Chief SHE Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/పీజీ (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌/సోషియాలజీ/సోషల్‌ సైన్సెస్‌ తదితర విభాగాలు)/పీజీ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 40 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 24, 25, 26 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు:

  • చీఫ్ ఎస్‌హెచ్‌ఈ ఆఫీసర్
  • డిప్యూటీ చీఫ్ ఎస్‌హెచ్‌ఈ ఆఫీసర్
  • సీనియర్ ఎస్‌హెచ్‌ఈ మేనేజర్
  • ఎస్‌హెచ్‌ఈ మేనేజర్
  • సీనియర్ కమ్యూనిటీ లైజన్ ఆఫీసర్
  • ఎస్‌హెచ్‌ఈ(ఎలక్ట్రికల్) మేనేజర్
  • ఆక్యుపేషనల్ హెల్త్ ఆఫీసర్
  • ట్రాఫిక్ ఇంజినీర్
  • సీనియర్ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్
  • సీనియర్ ఎన్విరాన్‌మెంట్ మేనేజర్
  • ఎన్విరాన్‌మెంట్ మేనేజర్

అడ్రస్: 405 & 406, Ircon International Limited SNS Synergy Building, Dumas Road Surat, Gujarat, Pin Code394120.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.