AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water and Diarrhea: డయేరియాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కొబ్బరి నీళ్లలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీటిలోని ఎలక్ట్రోలైట్స్ శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపి ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. ఐతే అతిగా కొబ్బరి నీళ్లు తాగారంటే మాత్రం సమస్యలు చుట్టుముట్టుతాయి. అవేంటంటే..

Coconut Water and Diarrhea: డయేరియాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Coconut Water
Srilakshmi C
|

Updated on: Aug 15, 2022 | 12:46 PM

Share

Can diarrhea patients drink coconut water? సీజనల్ వ్యాధుల్లో డయేరియా (అతిసారం) ప్రమాదకరమైనది. తీవ్రత ఎక్కువైతే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. సాధారణంగా పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. దీనిబారీన పడకుండా ఉండాలంటే శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెట్‌గా ఉంచుకోవాలి. అంటే నీళ్లు అధికంగా తాగుతూ ఉండాలి. నీళ్లలోని ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రీహైడ్రేట్ ఉంచడమేకాకుండా ద్రవ సమతుల్యతను నిర్వహిస్తాయి. డయేరియాతో బాధపడేవారు ద్రవ మూలకాలను త్వరగా కోల్పోతారు. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందువల్ల తగినన్ని నీళ్లు, ఇతర పానియాలు ఎక్కువగా సేవించాలి. వీటితోపాటు కొబ్బరి నీళ్లు కూడా తాగవచ్చు. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. ఈ పానీయంలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలోని ఎలక్ట్రోలైట్స్ శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపి ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. ఐతే అతిగా కొబ్బరి నీళ్లు తాగారంటే మాత్రం సమస్యలు చుట్టుముట్టుతాయి. అవేంటంటే..

డయేరియా వల్ల సంభవించే డీహైడ్రేషన్‌ను నివారించడంలో కొబ్బరి నీళ్లు కీలకపాత్ర పోషించినప్పటికీ ఎక్కువగా తాగితే మాత్రం విరేచనాలు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మోతాదుకు మించి తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక పొటాషియం శరీరంలో ద్రవ అసమతుల్యతను కూడా కలిగిస్తుంది. మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. దీనితోపాటు కడుపు ఉబ్బరం, వికారం, తరచుగా ప్రేగుల కదలికలు సంభవిస్తాయి. అధికంగా విరేచనాలైతే శరీరం నీరు, లవణాలను కోల్పోవడం ప్రారంభిస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ తలెత్తుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. సాధారణంగా విరేచనాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవిస్తాయి. పిల్లల వయస్సును బట్టి డయేరియా సంభవించడానికి గల కారణాలు మారుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.