AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homeopathy: హోమియోపతి మందులను తీసుకుంటున్నారా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

ప్రజలు తరచుగా హోమియోపతి మందులు తీసుకోవడంలో వలన ఎటువంటి హాని జరగదు. అయితే ఈ హోమియోపతి మందులను నిల్వ చేసే విషయం చేసే తప్పు ఆరోగ్యానికి బదులు హానిని చేస్తాయి.

Homeopathy: హోమియోపతి మందులను తీసుకుంటున్నారా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..
Homeopathy
Surya Kala
|

Updated on: Aug 15, 2022 | 11:19 AM

Share

Homeopathic Medicine: రోజు రోజుకీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువ మంది చిన్న వయస్సులోనే తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొంటున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించేది. అయితే ఇప్పుడు షుగర్, బీపీలు సర్వసాధారణ మైన వ్యాధిగా.. ప్రతి ఒక్కరికి వచ్చే వ్యాధిగా మారిపోయింది. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను దృష్టిలో ఉంచుకుని.. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..  వ్యాయామం, పరుగు, ఆరోగ్యకరమైన ఆహారం వంటి నియమాలను అనుసరించాలి. అంతేకాదు చిన్న చిన్న ఆరోగ్యకరమైన సహజమైన పద్ధతుల్లో వ్యాధుల నివారణకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.   వాటిలో ఒకటి హోమియోపతి ఔషధాల వినియోగం. అల్లోపతికి పూర్తి భిన్నమైన ఈ హోమియోపతి మందులు ఆలస్యంగా ప్రభావం చూపిస్తాయి..  అయితే ఈ హోమియోపతి మందులు దీర్ఘకాలంలో ఉత్తమ ఫలితాలను అందిస్తాయని.. అనేక పరిశోధనల్లో వెల్లడైంది.

హోమియోపతి మందులవలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. ఇదే హోమియోపతి పెద్ద ప్లస్ పాయింట్ గా పరిగణించబడుతుందని నిపుణులు పేర్కొన్నారు. కనుక ప్రజలు తరచుగా హోమియోపతి మందులు తీసుకోవడంలో వలన ఎటువంటి హాని జరగదు. అయితే ఈ హోమియోపతి మందులను నిల్వ చేసే విషయం చేసే తప్పు ఆరోగ్యానికి బదులు హానిని చేస్తాయి. కనుక ఈరోజు హోమియోపతి మందులను ఇంట్లో ఏ విధంగా ఉంచడం వలన ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయో తెలుసుకుందాం..

సూర్య కాంతిలో

ఇవి కూడా చదవండి

హోమియోపతి మందులను రొటీన్ గా తీసుకునేవారు.. మొదట్లో వాటిని సురక్షిత ప్రాంతాల్లోనే పెట్టుకుంటారు. కానీ  కొన్ని సార్లు.. ఏమి జరుగుతుందిలే అని భావించి .. అజాగ్రత్తగా ఎక్కడబడితే అక్కడ పెట్టడం మొదలుపెడతారు. అయితే మీరు హోమియోపతి మందులను తెరిచి ఉంచకపోయినా, వాటిని ఉంచేటప్పుడు.. ఉష్ణోగ్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హోమియోపతి మందులను ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా అధిక వేడిలో ఉంచినట్లయితే.. వాటిని శరీరంలోకి తీసుకున్న తర్వాత ఆ మందుల నుంచి సైడ్ ఎఫెక్ట్ ను ఎదుర్కోవలసి ఉంటుంది.

అంతేకాదు హోమియోపతి మందులను పెర్ఫ్యూమ్స్, సెంట్లు, ఫేస్ పౌడర్లు వంటివి ఉన్న ప్రాంతాల్లో పెట్టరాదు.

హోమియోపతి మందులను తాకరాదు  హోమియోపతి మందులను డైరెక్ట్ గా తమ చేతుల్లోకి తీసుకుని అనంతరం నోట్లో వేసుకుంటారు.  అయితే ఇలా ఏ ఔషధాన్ని అయిన సరే.. చేతులతో తాకడం హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..  మందులను తాకడం ద్వారా, సూక్ష్మక్రిములు వాటిపై చేరుకుంటాయి. ఈ జెర్మ్స్ కారణంగా, హోమియోపతి ఔషధం హానికరంగా మారవచ్చు. కనుక బద్దకంతోనో.. మరేదైనా కారణంతోనో హోమియోపతి మందులను తీసుకునే విషయంలో చేసే పొరపాటు చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

లోహంతో చేసిన వస్తువులతో మందులు తీసుకోవడం లోహంతో తయారు చేసిన వస్తువులతో హోమియోపతి మందులు వినియోగించరాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. హోమియోపతి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలు తరచుగా ఈ పొరపాటు చేస్తారు. అప్పుడు మందులు ఇచ్చే ఆరోగ్య  ప్రయోజనాలను నష్టపోవాల్సి వస్తుంది. మీరు హోమియోపతి ఔషధాన్ని ద్రవ రూపంలో తీసుకుంటే.. ఎల్లప్పుడూ గాజు గ్లాసుని  ఉపయోగించండి.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఉంది. TV9 తెలుగు ధృవీకరించలేదు. ఇక్కడ ఇచ్చిన సమాచారం నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..