AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin ‘K’ Rich Food: విటమిన్ ‘కె’ అధికంగా ఉండే ఆహారం తింటున్నారా? ఎన్ని లాభాలో..

మన శరీరానికి అవసరమైన విటమిన్‌లలో విటమిన్ 'కె' చాలా ముఖ్యం. విటమిన్ కె లోపిస్తే చిగుళ్లలో రక్తస్రావం, రక్తం త్వరగా గడ్డకట్టకపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఈ విటమిన్‌ లోపిస్తే..

Vitamin 'K' Rich Food: విటమిన్ 'కె' అధికంగా ఉండే ఆహారం తింటున్నారా? ఎన్ని లాభాలో..
Vitamin K Food
Srilakshmi C
|

Updated on: Aug 15, 2022 | 10:42 AM

Share

Vitamin ‘K’ Rich Food: మన శరీరానికి అవసరమైన విటమిన్‌లలో విటమిన్ ‘కె’ చాలా ముఖ్యం. విటమిన్ కె లోపిస్తే చిగుళ్లలో రక్తస్రావం, రక్తం త్వరగా గడ్డకట్టకపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఈ విటమిన్‌ లోపిస్తే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. బచ్చలికూర, బ్రోకలీ, క్యాబేజీ, ఎండిన రేగు పండ్లు, కివీ వంటి పండ్లు, ఆకుకూరల్లో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ ‘కె’తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

ఆస్టియోపోరోసిస్‌ నివారణ వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు నెమ్మదిగా పెరడం ప్రారంభమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ K అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎముక పగుళ్లు వంటి ఇతర బోన్‌ డిసీజ్‌లు రాకుండా నివారించవచ్చు.

పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పీరియడ్స్ సమయంలో మహిళలు కడుపు నొప్పితో బాధ పడుతారు. విటమిన్ కె అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం సమస్యను నివారించడమేకాకుండా, పీరియడ్స్ నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ కూడా సరైన సమయంలో వస్తాయి.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తి పెంపు విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ.

గుండె వ్యాధుల నుంచి రకణ విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి. హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్ వంటి సమస్యలను నివారించి, గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.