NIT Kurukshetra Recruitment 2022: కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 99 టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హర్యాణా రాష్ట్రానికి చెందిన కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Kurukshetra).. తాత్కాలిక ప్రాతిపదికన 99 అసిప్టెంట్‌ ప్రొపెసర్‌ (Assistant Professor Posts) పోస్టుల భర్తీకి..

NIT Kurukshetra Recruitment 2022: కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 99 టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..
Nit Kurukshetra
Follow us

|

Updated on: Aug 15, 2022 | 8:15 AM

NIT Kurukshetra Assistant Professor Grade-I Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హర్యాణా రాష్ట్రానికి చెందిన కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Kurukshetra).. తాత్కాలిక ప్రాతిపదికన 99 అసిప్టెంట్‌ ప్రొపెసర్‌ (Assistant Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, హ్యుమానిటీస్ & సోషల్‌ సైన్సెస్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, కంప్యూటర్ అప్లికేషన్స్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ లేదా రీసెర్చ్‌ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 60 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగినవారు సెప్టెంబర్‌ 5, 2022లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్‌లైన్‌ దరఖాస్తులను ఫిల్‌ చేసిన తర్వాత హార్డుకాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని సెప్టెంబర్‌ 10, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,01,500ల నుంచి రూ.1,67,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 2
  • డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు: 4
  • సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • సీనియర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజిక్స్) పోస్టులు: 1
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూట్రాన్) పోస్టులు: 1
  • సీనియర్ గ్రేడ్ ఆఫ్‌ ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ పోస్టులు: 22
  • ప్రిన్సిపాల్ పోస్టులు: 1
  • డైరెక్టర్‌ పోస్టులు: 1
  • ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్/ సర్వేయర్ ఆఫ్ వర్క్స్ (సివిల్) పోస్టులు: 2

అడ్రస్‌: The Registrar, National Institute of Technology, Kurukshetra-136119.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles